భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) తొలిసారి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) వేదికపై అడుగుపెడుతున్నాడు. 18 ఏళ్ల ఈ యువ బ్యాటర్ తన తండ్రిలాగే ఓపెనర్. డీపీఎల్ 2025 వేలంలో ఆర్యవీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పలువురు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. చివరకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు రూ. 8 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది.టీమిండియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ కుటుంబం నుంచి కూడా ఓ యువ క్రికెటర్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. విరాట్ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ లెగ్ స్పిన్నర్‌గా విభిన్న శైలితో బౌలింగ్ చేస్తున్నాడు. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు రూ. 1 లక్షకు కొనుగోలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతడు కూడా విరాట్‌కి కోచ్‌గా ఉన్న రాజ్‌కుమార్ శర్మ వద్దే శిక్షణ పొందుతున్నాడు.

ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లపై డిమాండ్
ఈ డీపీఎల్ వేలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనుభవం ఉన్న క్రికెటర్లకు భారీగా డిమాండ్ కనిపించింది. పేసర్ సిమర్‌జీత్ సింగ్ రూ. 39 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు వెళ్లాడు. అతడు వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ మరో హాట్ పిక్గా మారాడు. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రూ. 38 లక్షలతో తీసుకుంది.
వారసుల క్రికెట్ ప్రయాణం పై అందరి చూపు
ఈసారి డీపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారిన వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ వారసులు క్రికెట్ ప్రియుల్లో ఆసక్తి రేపుతున్నారు. వారు తండ్రుల జాడల్లో ఏ మేరకు ముందుకు వెళ్లగలరన్నది ఆసక్తికరంగా మారింది. యువ క్రికెటర్లు బరిలోకి దిగిన తొలి దశలోనే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం.
Read Also : Minister Vakiti Srihari : మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు