నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్‌రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు.

నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లీగల్ ఫార్మల్టీస్‌ను ఐటీ పూర్తి చేస్తోంది. గతంలో భారీ బడ్జెట్ సినిమాలు చేసిన ఆదాయం ఎక్కువగా వచ్చిందని ప్రకటించిన నిర్మాతల ఇళ్లలోనే ఐటీ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏకకాలంలో పెద్ద బ్యానర్స్ ఉన్న నిర్మాతలపై ఐటీ శాఖ దాడులు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.