బెంగళూరు : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరో 16 మందిపై బెంగళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే వీరందరిపై కేసు పెట్టింది.. మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప అని పోలీసులు తాజాగా వెల్లడించారు.
2014లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దుర్గప్పను.. అప్పటి యాజమాన్యం విధుల్లోంచి తొలగించింది. ముఖ్యంగా అతడు ఓ హనీ ట్రాప్ కేసులో ఇరుక్కోగా.. అప్పటి ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం.. బోవి వర్గానికి చెందిన దుర్గప్పను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే తాను నిర్దోషిని అని కావాలనే ఐఐఎస్సీ యాజమాన్యం సహా మరికొందరు తనపై కక్ష్య గట్టారని అప్పుడే దుర్గప్ప చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో అతడి మాటలు ఎవరూ వినలేదు.

ఇంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉన్న ఐఐఎస్సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప తాజాగా వీరందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఐఐఎస్ మాజీ డైరెక్టర్ బలరాంలతో పాటు అక్కడే పని చేసే ప్రొఫెసర్లు.. గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దానప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాధ్యాక కే, ప్రదీప్ డి సావ్కార్, మనోహరన్ తదితరులు ఉన్నారు.