SC classification GO released in Telangana

Telangana : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

Telangana : తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్‌, ఊర్దూ భాషల్లో గెజిట్‌ విడుదల చేసింది. గ్రూప్‌-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. గ్రూప్‌-2లో మాదిగ, దాని ఉపకులాల (18)కు 9 శాతం, గ్రూప్‌-3లో మాల, దాని ఉప కులాల (26)కు ఐదు శాతం కేటాయించింది. గ్రూప్‌-1లో 1,71,625 మంది, గ్రూప్‌-2లో 32,74,377 మంది, గ్రూప్‌-3లో 17,71,682 మంది ఉన్నారు.

Advertisements
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో

తర్వాత గ్రూప్‌-3 లోని వ్యక్తులతో భర్తీ

ఈ వర్గీకరణ ప్రకారం.. ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్‌-1లోని కులాలవారితో, అక్కడ మిగిలితే గ్రూప్‌-2, ఆ తర్వాత గ్రూప్‌-3 లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్‌ చేస్తారు. రోస్టర్‌ పాయింట్ల విభజన ఇలా.. గ్రూప్‌-1 లోని వారికి 7వ రోస్టర్‌ పాయింట్‌, గ్రూప్‌-2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్‌-3 లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్‌ పాయింట్లు ఉంటాయి.

గ్రూప్‌ బీ-లో 18 ఉపకులాలు,

తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లలో గ్రూప్‌ ఏలో అత్యంత వెనుకబడిన కులాల్లో 15 ఉపకులాలు, గ్రూప్‌ బీ-లో 18 ఉపకులాలు, గ్రూప్‌ సీలో 26 ఉపకులాలు ఉన్నాయి. 2026 జనాభా లెక్కలు పూర్తైన తర్వాత జనాభాకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: నేటి నుంచి ‘భూభారతి’

Related Posts
PM Modi: పహల్గాం ఉగ్రదాడిపై స్పందన: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మోదీ అత్యవసర సమీక్ష
PM Modi: పహల్గాం ఉగ్రదాడిపై స్పందన: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మోదీ అత్యవసర సమీక్ష

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి: ప్రధాని మోదీ పర్యటన రద్దు మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ దాడి Read more

IPL: పోరాడి ఓడిన ముంబై
mumbai cb

వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు నమోదు చేయగా, Read more

భారత భూభాగం స్వాధీనం: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!
భారత భూభాగం స్వాధీనం: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!

బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (బిజిబి) భారతదేశానికి చెందిన 5 కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా సంచలన వార్తలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో భారత సరిహద్దు Read more

హోర్డింగ్స్ ను కూలగొడుతున్న హైడ్రా
హోర్డింగ్స్ ను కూలగొడుతున్న హైడ్రా

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ (హైడ్రా ),చెప్పాలంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×