విజయవాడ: ఆహారపదార్ధాలు, మందుల నాణ్యతపై నిఘా పెంచాలితక్షణమే .ఖాళీలగా ఉన్న ఖాళీగా భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ఆదేశించారు. ఈ రెండు విభాగాలకు రెగ్యులర్ హెచ్వోడీలను నియమించాలి కల్తీతో కూడిన ఆహార పదార్థాలు (Adulterated food items), నాణ్యత లోపించిన మందుల సరఫరా పరిణామాల దృష్ట్యా ఈ రెండు విషయాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆహార పదార్ధాల్లో కల్తీని అరికట్టే ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) మరియు కల్తీ మందుల సరఫరాను నియంత్రించే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసిఎ) విభాగాల్లో వివిధ శ్రేణుల్లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రి సూచించారు.

మందుల సరఫరాల్లో నిఘా వ్యవస్థ పటిష్టం
మంత్రిత్వ శాఖలోని పలు విభాగాల పనితీరును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుతో రెండున్నర గంటలకు పైగా గురువారంనాడు వెలగపూడిలోని ఏపి సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) సమీక్షించారు. కల్తీ ఆహార పదార్ధాలు, మందుల సరఫరా (Supply of medicines) కు పాల్పడే వారిలో భయాన్ని కలిగించేలా తరచూ తనిఖీలు చేపట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎన్ఫోర్స్ మెంట్ విషయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐపిఎం, డిసిఎ విభాగాలకు దీర్ఘకాలంగా రెగ్యులర్ విభాగాధిపతులు లేకపోవడంతో ఈ శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అన్నారు. డిజిపి స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో డిసిఎ పనిచేయాల్సి ఉన్నందున, ఉన్నతాధికారుల కొరత ఉన్న నేపథ్యంలో ఐజిపి స్థాయి అధికారిని డైరెక్టర్ జనరల్ డిసిఎగా నియమించేందుకు తగు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. మరింత ఐపిఎంకు డైరెక్టర్ పోస్టు ఇప్పటివరకు మంజూరు కానందున, ఈ విభాగానికి మంజూరై ఖాళీగా ఉన్న కొన్ని స్థానాల్ని సరెండర్ చేసి డైరెక్టర్ పోస్టును సృష్టించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడానికి వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సమగ్ర నియామక ప్రణాళికను రూపొందించి నియామకాలు చేపట్టాలని మంత్రి సూచించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: TTD: తిరుమల లో రూ.8.13కోట్లతో టిటిడికి ఐఒసి గ్యాస్ ప్లాంట్