ప్రపంచ టెక్ రంగాన్ని నేతృత్వం వహిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) టెస్ట్ క్రికెట్ పట్ల తన ప్రేమను మరోసారి బయటపెట్టారు. భారత్-ఇంగ్లండ్ (India-England) జట్ల మధ్య జరిగిన ఉత్తేజకర టెస్ట్ సిరీస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

“ఇది కేవలం ఆట కాదు..ఇది అతీతంగా నిలిచే టెస్ట్ క్రికెట్”
భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్ట్‌ల సిరీస్‌ను ఉద్దేశించి సత్య నాదెళ్ల (Satya Nadella) ట్వీట్ చేశారు:
“25 రోజులు.. 5 యుద్ధాలు.. స్కోర్లు 2-2 సమం. ఇది కేవలం ఒక ఆట కాదు, ఇది కాలానికి అతీతంగా నిలిచే టెస్ట్ క్రికెట్ (Test cricket) గొప్పతనం.” రెండు జట్లూ ప్రదర్శించిన పోరాట పటిమను మెచ్చుకుంటూ, ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుందని అభిప్రాయపడ్డారు.
“పట్టుదల, నాటకీయత.. ఈ సిరీస్ చిరకాలం గుర్తుంటుంది”
సిరీస్‌లో కనిపించిన నాటకీయ పరిణామాలు, ఆటగాళ్ల పట్టుదల గురించి నాదెళ్ల ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సిరీస్ ఒక టెస్ట్ క్రికెట్ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. “హ్యాట్సాఫ్ టు బోత్ టీమ్స్” అంటూ రెండు జట్లను సమానంగా ప్రశంసించారు.
సత్య నాదెళ్ల చేసిన ఈ భావోద్వేగ పోస్టుపై క్రికెట్ అభిమానుల నుండి విశేష స్పందన వస్తోంది. “టెక్ ప్రపంచంలో మీ అంత పెద్ద వ్యక్తి కూడా క్రికెట్‌కి ఈ స్థాయిలో స్పందించడమే మాకు గర్వకారణం” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: