రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని వెల్లడిస్తూ, ప్రముఖ రియాల్టీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖపట్నంలో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇటీవల బెంగళూరులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సత్వా గ్రూప్ (Satwa Vantage) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు విశాఖలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.1500 కోట్ల పెట్టుబడితో “సత్వా వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్” నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగావకాశాలకు హబ్‌గా మారనున్న విశాఖ
ఈ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ వల్ల రాష్ట్రానికి మేలే జరుగుతుందని మంత్రి లోకేశ్ (Lokesh) తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఐటీ, వాణిజ్య, రెసిడెన్షియల్, సర్వీస్ సెక్చర్ల సమ్మిళితంగా ఉండే ఈ క్యాంపస్ విశాఖను కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌గా నిలబెడుతుందన్న విశ్వాసం వ్యక్తమైంది.
ఇతర సంస్థల నుంచి కూడా పెట్టుబడులు
సత్వా గ్రూప్‌తో పాటు ANSR అనే ప్రముఖ సంస్థ కూడా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ప్రభుత్వంతో కలిసి “GCC ఇన్నోవేషన్ క్యాంపస్” ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ మౌఖిక ఒప్పందం (MOU) చేసుకుంది. ఈ తరహా పెట్టుబడులు రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధిని తీసుకువస్తాయని, యువతకు అవకాశాలు కల్పిస్తాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
Read Also : Navodaya : ‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు