సత్తుపల్లి పట్టణంలోని సత్తుపల్లి విద్యాలయం ( శ్రీ చైతన్య టెక్నో కరికులం పాఠశాల ) విద్యార్థులు ఇటీవల నిర్వహించిన INTSO పరీక్షల్లో ప్రతిభ చూపారు. ముఖ్యంగా నాల్గో తరగతి విద్యార్థిని ఎస్.కే. సాదియా ప్రథమ బహుమతిగా టాబ్ గెలుచుకోవడం గర్వకారణంగా మారింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వర్ గారు సాదియాను అభినందించి బహుమతి ప్రదానం చేశారు.

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ పరీక్షల్లో పాఠశాల నుండి మొత్తం 240 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 142 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు మరియు ప్రత్యేక బహుమతులు గెలుచుకున్నారు. ఈ విజయంతో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటారు.
ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం తరఫున చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీ విద్య, డీజీఎం చేతన్ మరియు ఇతర బోధన సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.