కోలీవుడ్‌కి చెందిన పాపులర్ కమెడియన్ హీరో సంతానం ఇపుడు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఈసారి సినిమాతో కాదు, ఒక వివాదంతో హెడ్లైన్స్లోకి ఎక్కారు. తన తాజా చిత్రం డీడీ నెక్స్ట్ లెవల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరు అనవసరంగా వివాదంలోకి లాగబడింది.ఈ వివాదానికి కారణం సినిమాలో ఉన్న ఓ పాట. ఈ పాటలో శ్రీనివాస గోవింద అనే భక్తిగీతాన్ని పేరడీ చేశారు. “పార్కింగ్ డబ్బులు గోవిందా… పాప్‌కార్న్ ట్యాక్స్ గోవిందా…” అంటూ సాగే ఈ పాట హిందూ సంఘాల కోపాన్ని రేపింది.వారు ఈ గీతాన్ని తిరుమల శ్రీవారిపై అవమానంగా భావిస్తున్నారు. పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా బహిరంగంగా వ్యతిరేకత ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడులో కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

హీరో సంతానం స్పందన – “తప్పేం చేయలేదు”
ఈ వివాదంపై హీరో సంతానం స్పందించారు. ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, “తిరుమల శ్రీవారిని మేమెప్పుడూ అవమానించలేదు. పాట కేవలం వినోదం కోసం మాత్రమే. సెన్సార్ బోర్డ్ అనుమతించినదే. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు,” అని స్పష్టం చేశారు.అయితే, వివాదం తక్షణమే ఆగిపోయేలా కనిపించడం లేదు. హిందూ సంఘాలు పాటపై గట్టి ఆగ్రహంతో ఉన్నాయని స్పష్టమవుతోంది.డీడీ నెక్స్ట్ లెవల్ సినిమా, డీడీ మరియు డీడీ రిటర్న్స్ చిత్రాలకు కొనసాగింపుగా రూపొందింది. ఈ సినిమా మే 16న తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుంది.ఈ సినిమాకు ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కథలో సంతానం ఓ రివ్యూయర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా గీతికా తివారీ నటిస్తున్నారు.మరిన్ని ముఖ్యమైన పాత్రల్లో గౌతమ్ వాసుదేవ్ మేనన్, సెల్వ రాఘవన్, కస్తూరి, రాజేంద్రన్, యషికా ఆనంద్, నిళళ్ గల్ రవి తదితరులు ఉన్నారు. సినిమా ఫుల్ కామెడీ థ్రిల్లర్‌గా వస్తోంది.
పాటే సినిమా విజయంపై ప్రభావం చూపుతుందా?
ఈ వివాదం సినిమా రన్‌పై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరమైన అంశం. ప్రమోషన్ టైమ్‌లో ఈ వివాదం రావడం టీమ్‌కి షాక్ అయ్యే విషయమే. అయితే కొన్ని సార్లు నెగటివ్ ప్రచారమే సినిమాకు బోనస్ అవుతుంది. ఏం జరుగుతుందో విడుదలైన తర్వాతే తెలుస్తుంది.
Read Also : Sreeleela : నార్త్ ఇండియా మీద ఫోకస్ పెట్టిన శ్రీలీల