SKV firstweek

వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్ …సంక్రాంతి మొత్తం నీదే..!

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అదే టాక్ రావడంతో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ పోటీ పడుతున్నారు. మొదటినుండి కూడా వెంకీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ తో హౌస్ ఫుల్ అవుతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

విడుదలైన తొలి వారం రోజుల్లోనే రూ.203 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రాంతీయ సినిమాల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అని పేర్కొంది. కాగా వెంకటేశ్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ఇదే. ఇలా వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తుండడం తో అభిమానులు వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్…సంక్రాంతి సీజన్ మొత్తం నీదేనా అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts
రేవంత్ రెడ్డి మాదిరి లుచ్చా పనులు చేయలేదు – కేటీఆర్
ktr tweet

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ కోసం తన నివాసం నుంచి కార్యాలయానికి బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన పార్టీ Read more

లాస్ ఏంజెలిస్ లో మళ్లీ మంటలు.. హెచ్చరికలు
los angeles wildfires

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరానికి మరోసారి అగ్నిమాపక ముప్పు ఏర్పడింది. తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది వద్ద కొత్తగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం Read more

‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు
‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు విరాళాలపై ఆదాయ పన్ను మినహాయింపును కల్పిస్తూ కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద Read more

ప్రజల వద్దకు కాంగ్రెస్ ‘ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్’
cm revanth reddy district tour

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి సంవత్సరం పూర్తి కాబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ప్రజలకు సాధించిన ఫలితాలను విస్తృతంగా వివరించేందుకు ప్రగతి నివేదికను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *