हिन्दी | Epaper
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Heart attacks: యుక్తప్రాయంలోనే ప్రాణాలు తీస్తున్న గుండెపోటు

Digital
Heart attacks: యుక్తప్రాయంలోనే ప్రాణాలు తీస్తున్న గుండెపోటు

Heart attacks: సుమారు రెండు, మూడు దశాబ్దాల క్రితం గుండెపోటు అంటే కనీసం 55 సంవత్సరాలు దాటిన వారికే వచ్చేది. 50 సంవత్సరాలు దాటిన తరువాత గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించే వారు.

గుండెపోటు ఇక వృద్ధులకు మాత్రమే కాదు

అయితే గత దశాబ్దకాలంగా గుండెపోటు(Heart attacks) యుక్త వయస్సులో(young age) ఉన్న వారికి సైతం వస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్కు 21 ఏటనే గుండెపోటుతో మృతి చెందాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి తన పెళ్లి కార్డులు పంచుతూ గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు.

సినీ నటుడు తారకరత్న చిత్తూరులో నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్రకు హాజరై ఒక్కసారిగా కుప్ప కూలి గుండెపోటుకు గురయ్యాడు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న విద్యార్థి గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.

Heart attack

పాతబస్తీలో కొందరు యువకులు కబడ్డీ అడుతుండగా అందులో ఒక యువకుడు గుండెపోటుకు(Heart attacks) గురై మృతి చెందాడు, ఒకరిద్దరు కాదు పెద్ద సంఖ్యలోనే యువకులు గుండెపోటుకు గురౌతున్నారు. యుక్తవయస్సులోనే వీరి గుండెలు నీరసించి పోతున్నాయి.

మారిన జీవనశైలి

జన్యుపరమైన కారణాల కంటే ఎక్కువగా మారుతున్న జీవన విధానం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురౌతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో సుమారు ఏడు కోట్ల మంది గుండెవ్యాధులతో చికిత్స పొందుతుండగా వారిలో రెండున్నర కోట్ల మంది 35 సంవత్సరాల లోపు వారు ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇది అనధికారికంగా అంతకు రెట్టింపు మంది యువకులు గుండెపోటు, హృద్రోగ సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రస్తుతం వివిధ కారణాలతో 40 సంవత్సరాల లోపు వారు చనిపోతుండగా వారిలో గుండెపరమైన సమస్యలతో చనిపోతున్న వారు 30 శాతం వరకు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Heart attack

నిత్యం వ్యాయామం చేస్తున్న వారు కూడా గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణం మారుతున్న సమాజంలో యువత అలవాటు పడుతున్న ఆహారపు అలవాట్లు, వత్తిడిలు అని తెలుస్తోంది. ప్రధానంగా యువతకు గుండెపోటు రావడానికి అయిదు కారణాలు ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు.

అందులో ముందు వరసలో మానసిక వత్తిడి కారణంగా నిలిచింది. విద్యారంగంతో పాటు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా ఇటీవల కాలంలో వత్తిడి పెరిగింది. విద్యార్థి దశ నుంచి 95 శాతానికి మించి మార్కులు సాధించాలన్న వత్తిడి పెరిగింది.

విద్యా, ఉపాధి రంగాల్లో వత్తిడి

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ మార్కుల ప్రాతిపదికన విద్యార్థులపై వత్తిడి తీసుకువస్తున్నారు. ఉదయం నాలుగున్నర గంటల నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభం అవుతుంది. తిండి కూడా సరిగ్గా తినేందుకు లేకుండా రాత్రి పది, పదిన్నర వరకు చదువుపైనే కాలం గడిచిపోతోంది.

Heart attack

దీనితో విద్యార్థులు తీవ్ర వత్తిడికి గురౌతున్నారు. అప్పటి నుంచే వీరి గుండె బలహీన పడటం ప్రారంభిస్తోంది. వందకు వంద మార్కులు సాధించి నెలకు లక్షలాది రూపాయల ఆదాయం పొందడం విషయాన్ని అటుంచితే 30 సంవత్సరాల వరకు ఆ విద్యార్థి బతికి ఉంటాడా అన్న అనుమానం కలుగుతోంది.

జంక్ ఫుడ్ – నిశ్శబ్ద హంతకుడు

మరోపక్క చదువే ప్రధాన లక్ష్యం కావడంతో సరైన తిండి లభించడం లేదు. త్వరగా భోజనం కానివ్వాలన్న తపనతో జంక్ఫుడ్స్ వైపు విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా టిఫిన్ బాక్స్ లో జంక్ ఫుడ్స్ నింపి ఇస్తున్నారు.

ఏమైనా చెబితే మా బాబు ఇవి తప్ప భోజనం చేయడానికి ఇష్టపడడు అంటూ తమ హోదాను, స్థాయిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఒక శాపంగా మారాయి. రెండేళ్ల నుంచి సెల్ఫోన్కు పిల్లలు అతుక్కుని పోతున్నారు.

మొబైల్ వాడకం వల్ల యువత ఆరోగ్య సమస్యలు

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు కనీసం ఐదారు గంటలు ఫోన్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అన్నం తినిపించడానికి తల్లిదండ్రులే సెల్ఫోన్లో వీడియోలు సెలక్ట్ చేసి పిల్లల ముందు పెడుతున్నారు, చిన్నప్పటి నుంచే ఎటువంటి వ్యాయామం లేకుండా తలదించుకుని సెల్ఫోన్ చూస్తూ పిల్లలు పెరుగుతున్నారు.

ఈ విధానం వల్ల ఒక్క గుండెజబ్బులు మాత్రమే కాదు, ఊబకాయం, మతిమరుపు, ఏ విషయంపైనా శ్రద్ధ లేకపోవడం వంటి అనేక రుగ్మతలు చిన్నారులను వెంటాడుతున్నాయి. ఇక ఒక వయస్సు వచ్చిన తరువాత ధూమపానం, మద్యం సేవించడం ఒక స్టేటస్ సింబల్గా మారింది.

డ్రగ్స్, గంజాయి – యువత ప్రాణాలను దెబ్బతీసే భయంకర వ్యసనాలు

ఇటీవల కాలంలో గంజాయి, డ్రగ్స్ అందుబాటులో రావడంతో యువత త్వరగా పెడమార్గాన్ని అనుసరిస్తున్నారు. పబ్లలో బాహటంగానే డ్రగ్స్ ఇస్తున్నారు. చాలా మంది యువత రాత్రి కాగానే మత్తులో జోగుతున్నారు.

Heart attack

ఇంజనీరింగ్, మెడికల్, బిజినెస్ స్కూల్స్, కళాశాలల వద్ద గంజాయి అమ్మే ముఠాలు పెరిగిపోతున్నాయి. సాధారణ సిగరెట్టు ఎవరైనా తాగుతారు… గంజాయి తాగితే అ మజాయే వేరుగా ఉంటుందని, గంజాయి తాగితే ఒక హీరోగా చలామణి అవుతామన్న చెడు భావన యువతలో స్పష్టంగా కనిపిస్తోంది.

కుటుంబ వ్యవస్థల బలహీనతతో పెరుగుతున్న ఒంటరితనము

గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పెద్దలు పిల్లల మనస్తత్వాన్ని గమనించే వారు. ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాలు ఫ్యాషన్గా మారాయి. తల్లిదండ్రులు ఉద్యోగాల పేరుతో బయటకు వెళ్లి రాత్రికి తిరిగి వస్తారు.

అప్పటి వరకు చిన్న పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో వారు ఫోన్లలో ఏయే వీడియోలు చూస్తున్నారు…? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్న విషయం తెలియడంలేదు.

జీవన విధానంలో మార్పులు వస్తేనేగాని హృద్రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Read also: Viral fevers: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870