Alert on Medical Mafia:ప్రస్తుతం కరోనా మూడవ వేవ్ ప్రభావం చూపుతోంది. కరోనా, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వంటి వైరస్లు విజృంభిస్తున్నాయి.
రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వైరస్ ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
మాల్స్, సినీ థియేటర్స్, శుభకార్యాలు. అంత్యక్రియలు వంటి వివిధ కార్యక్రమాల్లో కరోనా నిబంధనలు అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో విద్యాసంస్థలను ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం. శానిటైజర్లతో చేతుల శుభ్రతవంటి జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఎపిలోఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుండా ఎక్కిన ప్రయాణీలకు 50 రూపాయల స్పాట్ ఫైన్ కూడా విధిస్తున్నారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలుఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా చాపకిందనీరులా వ్యాపిస్తూనేఉంది.
ఇప్పటికే ప్రజలు రెండు వేప్లను ఎదుర్కొన్నారు. మొదటి, రెండవ వేవ్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి వేవ్ అసలు చికిత్స విధానం గాని, వాక్సినేషన్పై (vaccination) కాని ఎలాంటి అవగాహన లేదు.
మొదటిసారిగా వైరస్ జోరుగా వ్యాప్తి చెందే విధానాన్ని చవిచూశారు. మొదటిసారి కావడంతో ఆందోళనకర వాతావరణం
నెలకొంది.
రెండవ వేవ్ వచ్చేసరికి కొంతవరకు ఈ వైరస్ (Virus) పై అవగాహన కలిగింది. అయినప్పటికీ మరణాల సంఖ్య ఎక్కువగానే నమోదైంది. ప్రస్తుతం మూడవ వేవ్ ప్రవేశించేసరికి దాదాపుగా రెండు డోస్ల వాక్సిన్ వేసుకున్నారు. శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకున్నారు.

వైరస్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్తన ప్రభావాన్ని చూపుతోంంది. మొదటి వేప్లో చాలా మంది
ఆస్పత్రులకు పరుగులు తీసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. రెండవ వేవ్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపించింది.
ఇక మూడవ వేవ్ మరణాల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతోంది. రెండు వాక్సిన్ లు తీసుకున్న ప్రభావం కారణంగా ఒమిక్రాన్ వ్యాప్తి కూడా
చాలా మందకొడిగానే ఉంది.
అయితే కరోనా మాత్రం జోరుగానే వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఆరోగ్యం విషయంలో పడుతున్న ఆందోళనను కొన్ని కార్పొరేట్ వైద్య సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే ప్రజల్లో మూడవ వేవ్ పట్ల భయాందోళనలు పెంచడానికి కొన్ని వర్గాలు
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ ప్రచారాన్ని
కొనసాగిస్తున్నాయి. ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది.
దోపిడీకి పాల్పడుతున్న కొన్ని కార్పొరేట్ వైద్య సంస్థలను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి. వాటిపై దూకుడుగా వ్యవహరించలేకపోతున్నాయి.
దీనిని అసరాగా తీసుకుని కొన్ని వైద్య సంస్థలు ప్రజలను అందినకాడికి దోచుకునే ప్రయత్నాలను ప్రారంభించాయి. మొదటి, రెండవ వేవ్లలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలను దక్కించుకోలేకపోయారు.
ఇలాంటి కుటుంబాల పట్ల కొంత మానవతాదృక్పదంతో వ్యవహించాల్సిన కార్పొరేట్ వైద్య సంస్థలు చివరకు మృత దేహాన్ని ఇవ్వడానికి కూడా డబ్బు అడిగి వేధించుకుని తిన్నాయి. చాలా వైద్య సంంస్థలు ప్రజలు ఆరోపణలు చేశారు.

కొందరు ఆధారాలతోసహా ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. ఏదో నామమాత్రంగా నాలుగైదు ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా చికిత్సను రద్దు చేస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. నెల రోజుల తరువాత అవి తిరిగి కరోనా చికిత్సను ప్రారంభించాయి.
ఇలాంటి చర్యల వల్ల దోపిడీకి పాల్పడుతున్న కొన్ని కార్పొరేట్ సంస్థలకు మరింత రెచ్చిపోయే అవకాశం కల్పించినట్లు అయ్యింది.
ఆస్పత్రుల్లో చేరిన రోగులకు వివిధ సౌకర్యాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. రూం శానిటైజేషన్ కోసమని కొన్ని ఆస్పత్రులు రోజుకు రెండు నుంచి మూడు వేల రూపాయలు. పిపిఇ కిట్లను ధరించడానికి 20 వేల రూపాయలు వసూలు చేశారు. ఇక వెంటిలేటర్పై ఉంచితే రోజుకు 30 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేశారు.
కరోనాతో భయపడుతున్న ప్రజల అమాయకత్వాన్ని
ఆసరాగా తీసుకుని కోట్లాది రూపాయలు గడించాయి. ఈసారి ప్రజలు ఇలాంటి ఆసుపత్రుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కరోనా
గానీ, ఒమిక్రాన్గానీ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలితే అధైర్య పడకూడదు. వైరస్ సోకిన వెంటనే ప్రాణాలు పోవన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా సాధ్యమైనంత వరకు హోం ఐసోలేషన్ ద్వారా వైరస్ను తగ్గించుకోవడం, వేరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం
వంటి విషయాలపై దృష్టి సారించాలి.
పారాష్యూటమాల్, మల్టీ విటమిన్ టాబ్లెట్లు తీసుకోవడం, ఇమ్యూనిటీ పెంచుకునేందుకు అవసరమ్యే ఆహార పదార్థాలను, మందులను తీసుకోవడంపై శ్రద్ద చూపించాలి.
ఆక్సో మీటర్ను దగ్గర ఉంచుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. 91కంటే తక్కువగా ఉంటేనే ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని గ్రహించాలి.
ఆ సమయంలో మాత్రమే ఆసుపత్రి వర్గాలను సంప్రదించాలి. అంతకంటే తక్కువగా దిగజారిపోతూ ఉంటే ఆసుపత్రిలో చేరడం మంచిది.
అంతేకాని 91 కంటే ఎక్కువగా ఆక్సోమీటర్ చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనే ఆస్పత్రుల్లో చేరకపోవడమే మంచిది. సాధారణంగా ఆక్సో మీటర్లో పాయింట్లు తగ్గుతుంటే ఆందోళన పెరుగుతుంది.
ఈ ఆందోళన ప్రభావం శరీరంపై చూపుతుంది. కరోనా, డెల్టా వేరియంట్. ఒమిక్రాన్ సోకితే మనస్సు ప్రశాంతం చేసుకోవాలి.
తొందరపాటు నిర్ణయాల జోలికి వెళ్లకూడదు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో చేరాలన్న తపనను పక్కన పెట్టాలి. రెండు డోసులు టీకాలు తీసుకున్నవారు తమకు ఈ వైరస్లు ఏమీ చేయవన్న ధీమాను పెంచుకోవాలి.
స్వీయనియంత్రణతోనే రక్షణ పొందేందుకు ప్రయత్నించాలి. మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకోకుండాఅప్రమత్తంగా వ్యవహరించాలి.
సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరేందుకే ప్రయత్నించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సేవలు, చికిత్సా విధానం అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
Read also: hindi.vaartha.com
Read also: