యువత శక్తి – మార్పు సాధ్యమే
(Young Leaders of India) జనాభాలో సుమారుగా 60 శాతం మంది యువతే ఉన్నారు. వాళ్లు ఈ ప్రపంచానికి తమ శక్తిని చాటుతున్నారు. ఐటీ రంగం, స్టార్టప్లు (startup), పరిశోధన, అంత రిక్ష విజ్ఞానం, ఆర్మీ వంటి రంగాల్లో ప్రపంచ దేశాలకు ఆద ర్శంగా నిలుస్తున్నారు. కానీ ఇదే యువత రాజకీయాల్లో మాత్రం తీవ్రంగా వెనుకబడిపోతున్నారు. ఇది కేవలం వ్యక్తి గత వెనుకడుగు కాదు, ప్రజాస్వామ్య పరంగా అత్యంత ఆందోళన కలిగించే పరిస్థితి. వాళ్లు ఓటు వేస్తున్నారు. సోష ల్ మీడియాలో రాజకీయం గురించి చురుగ్గా చర్చిస్తున్నారు. గ్రామాలలో రచ్చబండల దగ్గర రాజకీయల గురించి రాజ కీయ నాయకుల గురించి చర్చలు, వాదనలు జరుపుతారు. కానీ పాలనా వ్యవస్థలోకి అడుగుపెట్టే యువత మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి ‘రాజకీయాలు మురికి కూపం’, అనే భావనలు యువతను వెనక్కిలాగుతున్నాయి. చాలా పార్టీల్లో కుటుంబ వారసత్వాలే ఆధిపత్యం చూపుతు న్నాయి. సామాన్య యువతకు అవకాశాలు లేకుండాపోయా యి. నైపుణ్యం, నీతికిస్థానమే లేకుండా డబ్బు, కులతత్వమే నిర్ణాయకంగా మారిన రాజకీయ సమీకరణలు యువతలో భరోసా తగ్గిస్తున్నాయి. ఎన్నికల సమయంలో లిక్కర్, నగదు వంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోవడం, నిజా యితీగల యువతకు నిరాశకలిగిస్తోంది. పాఠశాలస్థాయిలోనే రాజకీయ అవగాహన, చట్టాలపై పరిజ్ఞానం కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాల్లో పాలొ నకపోయినా, సోషల్ మీడియాలో ప్రశ్నించడానికి, ప్రచారా నికి యువత పరిమితమవుతోంది.
రాజకీయాల్లో యువత పాత్ర – భవిష్యత్తు నిర్మాణానికి అవసరం

రేపటి భవిష్యత్తు అంతా యువతదే అలాంటి యువతకు ఏం కావాలి, వారి అభి వృద్ధికి దిశా నిర్దేశం చేయాలంటే చదువుకున్న విచక్షణ విలువలతో కూడిన యువత తప్పకుండా రాజకీయాలలోకి రావాలి. రాజ్యాధికారంలో వుండాలి ఉపాధి, వ్యవసాయం, విద్య, టెక్నాలజీ వంటి అంశాలు యువతకు నిత్య సంబం ధితమైనవి. పాత తరం నాయకత్వం వేగం లేక, ప్రజల సమస్యల పట్ల అవగాహన లేక అభివృద్ధి దూరమవుతుంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం, పారదర్శకత, టెక్నాలజీ వాడ కాన్ని యువత బాగా నేర్చుకుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేతత్వం, క్రియాశీలత యువతలో సహజంగా ఉంది. నూతన పాలనా శైలి – ప్రజలకు చేరువైన, డిజిటల్ ఆధా రిత పాలన అవసరం ఉంది. ఇది యువత చేతిలో సాధ్యమవుతుంది.
దేశ మార్పుకు యువతే మార్గం

రాజకీయాల్లో పాల్గొనడం యువత బాధ్య తగా భావించాలి. దేశ భవిష్యత్తు గురించి యువత ఆలో చించాలి అంటే రాజకీయాలలో గళమెత్తాలి. శాసనసభలు, లోక్సభల్లో యువత శాతం చాలా తక్కువగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నిజానికి నేటి యువతే రేపటి నాయకులు. వాళ్లుమౌనంగా ఉంటే ఈ దేశ పాలనా విధానం మారదు. ఓటును చక్కగా వినియోగించాలి. డబ్బు, కులం ఆధారంగా కాదు, అభ్యర్థి పనితీరు, నైతికత ఆధా రంగా ఓటు వేయాలి. గ్రామస్థాయిలో పాలనలో చురుకుగా పాల్గొనాలి. సర్పంచ్ స్థాయి నుంచే ప్రయాణం మొదలు పెట్టాలి. విద్యార్థి సంఘాలు, యువజన ఉద్యమాల్లో చురు కుగా పాల్గొనాలి. విమర్శకులు కాకుండాపరిష్కారాలు చెప్పే నాయకులుగా ఎదగాలి. ప్రలోభాలకు లొంగని ధైర్యంకలిగిన యువత కావాలి. నైతిక విలువలు, ప్రజల పట్ల ప్రేమ కలి గిన యువత రాజకీయాల్లోకి రావాలి. అవినీతి, పాతకాలపు పాలనా పద్ధతుల నుండి విముక్తి కావాలంటే యువత ముం దుకు రావాల్సిందే. నేడు మనదేశం సాంకేతికంగా ముంద డుగు వేస్తున్నా, పాలనారంగంలో మాత్రం పాత పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని మార్చే శక్తి యువతలో ఉంది. నూతన భారత నిర్మాణానికి యువతే కీలకం.(Young Leaders of India)
Read This : https://vaartha.com/category/smpaadhakiyam/
Read Also : Future Leadership : నేటి యువకులే రేపటి పాలకులు