ఆర్ఎన్ఎస్ అధినేత(RSS Chief) మోహన్ భగవత్(Mohan Bhavath) చేసిన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేసినవో గాని మొత్తానికి అన్ని రాజకీయ పార్టీ(Political Party)లో ఈ అంశం పెద్ద రాజకీయ దుమారమే లేపిందనే చర్చ జోరుగా సాగుతుంది. రాజ్యాంగవరంగా రాజకీయాల్లో నాయకులకు రిటైర్మెంట్(Retirement) వయసుకు సంబంధించిన అంశం ఎంతవరకు సాధ్యం అన్న విషయాన్ని పక్కన పెడితే, వయసు పైబడిపోతున్న కొందరు చివరి వరకు రాజకీయాల్లో అలాగే కొనసాగుతూ ఉండడం, ఆధునిక రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందిన నేటితరం యువ రాజకీయ నాయకత్వానికి కొన్ని సందర్భాల్లో తప్పితే చాలావరకు రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు రాకపోవడానికి ఒక కారణం కావచ్చు అనే సంశయం కలగక మానదు. ఏదేమైనప్పటికీ దేశ రాజకీయ వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలలో వయసులో పెద్దవారై రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన నాయకులు ఈతరం నాయకులకు మార్గదర్శకులుగా ఉంటూ, మంచి ఆలోచన వివేచన నిర్ణయాత్మక ధోరణిగల యువ నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే వాదనలు సమాజంలో వినిపిస్తుండడం గమనార్హం.

ఇటీవల ఒక సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ రాజకీయాల్లో డెబ్భై ఐదు సంవత్సరాలు వయసు పైబడిన నాయకులు స్వచ్ఛందంగా హుందాతనంగా రాజకీయాల నుండి తప్పుకోవాలన్న సూచన, రాజకీయాలలో కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న భావనకు దారితీస్తుందనే భిన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో సంచలనాలు రేపుతున్నాయి. అయితే రాజకీయాల్లో స్వచ్ఛంద విరమణ ప్రామాణికం డెబ్బైఐదు ఏళ్ల వయస్సు తర్వాతే ఎందుకని ఆర్ఎస్ఎస్ అధినేత వ్యాఖ్యలు ఉన్నా యన్న అంశంపై రాజకీయాల్లో విభిన్న వాదనలు తెర పైకి వస్తున్నాయి.
ఒక ప్రత్యేకమైన వయసు పరిమితి
ఈ క్రమంలో అసలు రాజకీయంలో వయస్సు పైబడిన వారికి రాజకీయాల నుండి నిష్క్రమణ ఎందుకు ఉండకూడదు అనే చర్చ మరోవైపు కొనసాగుతుంది. రాజ్యాంగ ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ కావాలన్నా ఒక ప్రత్యేకమైన వయసు పరిమితి నిర్ధారించిన భారత రాజ్యాంగం మరి రాజకీయాల నుండి తప్పుకోవడానికి రాజకీయ నాయకులకి ఏ వయసు వరకు పరిమితం కావాలని సూచించిన దాఖలాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని పక్కన పెడితే, రాజకీయ నాయకులు డెబ్భై ఐదు సంవత్సరాల జీవిత గమనంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల సమస్యలకు స్వయంగా తీసుకునే నిర్ణయాలు సమస్య పరిష్కారానికి ఏ మేరకు ప్రభావితం చేయగలరనే సంశయం కొందరిలోనైన లేకపోలేదు. డెబ్భై ఐదు ఏళ్లు పూర్తయినా మనసు స్థిరంగా ఉన్నా, వయసు పైబడుతుంటే చాలావరకు శరీరం అనుకున్న స్థాయిలో సహకరించక పోవడం సహజం. అలాంటి పరిస్థితుల్లో కొత్త తరం యువ నాయకత్వంపై తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన పరిస్థితు లు ప్రత్యామ్నాయంగా అత్యవసరమవుతాయని అర్ధం చేసు కోగల మనస్తత్వం అన్ని పార్టీలోని రాజకీయ నాయకులలో ఉండాల్సిందేమో.
కొత్త తరం నాయకత్వానికి మార్గదర్శకులు
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో అనేక సంవత్సరాలు అనుభవం ఉన్న రాజకీయ నాయక త్వం కొత్త తరం యువ నాయకత్వానికి ప్రతిబింబంవలె గోచరిస్తూ, కొత్త తరం నాయకత్వానికి మార్గదర్శకులుగా ఉండి యువ నాయకత్వాన్ని సరేన దిశానిర్దేశంలోముందుకు నడిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే భావన అవ కాశాలు రావటం లేదన్న కొత్తతరం యువ రాజకీయ నాయ కులలో కొంతైన ఉంటుందని భావించే వారు లేకపోలేదు. ప్రస్తుతం దేశంలో వచ్చే ఎన్నికల వరకు అనేక రాజకీయ పార్టీలలో నాయకులు చాలావరకు పది పదులు దాటిన వయసున్నవారే అధికంగా ఉండడం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవి విరమణ వయసు ఉన్నట్ల రాజకీయాల్లో కూడా పదవి విరమణ అనేది సాధ్యమవుతుం దా కాదా అనే చర్చ సమాజంలో జోరుగా సాగుతుంది. నిజానికి గత ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పెన్షన్ విధానం ఉన్నట్లు ఎమ్మెల్యే, ఎంపీలకు కాలపరిమితితోపాటు వారి హోదాలను బట్టి నెలనెలా జీతాలు ఉంటాయి. తిరిగి వారు ఎన్నిక కాక పోయినా జీవితాంతం వారికి ప్రత్యేక పెన్షన్ తో పాటు అనేక సదుపాయాలు ఉంటాయి.
మోహన్ భగవత్ చేసిన సూచనలు
అలాంట ప్పుడు రిటర్మెంట్ వయసు ఎందుకు ఉండకూడదు అనే సందేహం సమా జంలో లేకపోలేదు. రాజకీయ నాయకుల రిటైర్మెంట్ వయసు గురించి మోహన్ భగవత్ చేసిన సూచనలు ఏవిధంగా ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులకు స్వచ్ఛంద రాజకీయ విరమణ విషయంలో అవసరమైతేతప్ప వ్యక్తి గతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ, రాజకీయంలోకి పోయిన తర్వాత ప్రజలు ఎన్నుకున్నంత కాలం నాయకులు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తుండడం దేశ చరిత్రలో ఆనవాయితీగా వస్తూనే ఉంది. కాని మితిమీరిన వయస్సు ఎవరైనా సరే ఏ వృత్తిలోనైనా ఎల్లప్పుడూ అనుకున్న పనులు చేయుటకు శరీరం సహకరించదనే విభిన్న అభిప్రాయాలు సమాజంలో లేకపోలేదు. అధిక వయసులో ఉన్నవారు దేశ రాజకీయా ల్లో ప్రాధాన్యత గల పదవుల్లో ఉన్నప్పుడు దేశ అంతర్జాతీ య విషయాల్లో సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ సరియైన మూర్తిమత్వాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు రాజకీయలను భవం ఒక మహా ఆయుధంగా కొన్ని సందర్భాల్లో ఉపయు క్తమైన, మరి కొన్ని సందర్భాల్లో అన్ని విధాల అర్హత కలిగి దేశ రాజకీయాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచే యువనాయ కత్వం కూడా అవసరమనే వాదనలు తెరపైకి రాకమానవు.
పెద్ద రాజకీయ దుమారం
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేసినవో గాని మొత్తానికి అన్ని రాజకీయ పార్టీ లో ఈ అంశం పెద్ద రాజకీయ దుమారమే లేపిందనే చర్చ జోరుగా సాగుతుంది. రాజ్యాంగపరంగా రాజకీయాల్లో నాయకులకు రిటైర్మెంట్ వయసుకు సంబంధించిన అంశం ఎంతవరకు సాధ్యం అన్న విషయాన్ని పక్కన పెడితే, వయసు పైబడిపోతున్న కొందరు చివరి వరకు రాజకీయా ల్లో అలాగే కొనసాగుతూ ఉండడం, ఆధునిక రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందిన నేటితరం యువ రాజకీయ నాయకత్వానికి కొన్ని సందర్భాల్లో తప్పితే చాలావరకు రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు రాకపోవడానికి ఒక కారణం కావచ్చు అనే సంశయం కలగక మానదు. ఏదేమైనప్పటికీ దేశ రాజకీయ వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలలో వయసులో పెద్దవారై రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన నాయకులు ఈతరం నాయకులకు మార్గదర్శకులుగా ఉంటూ, మంచి ఆలోచన వివేచన నిర్ణయాత్మక ధోరణిగల యువ నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే వాద నలు సమాజంలో వినిపిస్తుండడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Warning : చంద్రబాబు కు జగన్ వార్నింగ్