పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక ప్రధాన మలుపుగా నిలిచిన సంఘటన బ్యాంకుల జాతీయీకరణ, అదే ఏడాది జూలై 19న, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ (Nationalization) నిర్ణయం దేశ ఆర్థిక రంగాన్ని, ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. అప్పటివరకు బ్యాంకింగ్ రంగం ఒక పరిమిత వర్గానికి మాత్రమే సేవలందించేది. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు, పెద్ద రైతులు, పట్టణ వాణిజ్య వర్గాలకే ఇది అందు బాటులో ఉండేది. గ్రామీణ భారతం, వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమలు, పేద ప్రజలు బ్యాంకింగ్ (Banking) వ్యవస్థకు దూ రంగా ఉండిపోయారు. ఈ పరిస్థితిని మార్చాలని భావిం చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం బ్యాంకింగ్ ఆన్ ది డోర్ స్టెప్ ఆఫ్ ద పూర్’ అనే ధ్యేయంతో బ్యాంకుల జాతీయీకరణ చర్యను చేపట్టింది.
ప్రాధాన్యత రంగాలను నిర్లక్ష్యం చేశాయి.
1960వ దశకం భారతదేశానికి ఆర్థికం గా, రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్న కాలం. స్వాతంత్రం వచ్చినప్పటికీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. ప్రైవేట్ బ్యాంకులు, ఎక్కువగా పారిశ్రామిక వర్గాల నియంత్రణలో ఉండి, ప్రధానంగా పెద్ద పరిశ్రమలు స్థాపిత వ్యాపారాల క్రెడిట్ అవసరాలను తీర్చడానికి మొగ్గు చూపాయి. వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు ఇతర ప్రాధాన్యత రంగాలను నిర్లక్ష్యం చేశాయి. ఇది రుణ పంఎ * ణీలో గణనీయమైన అసమానతలకు దారితీసింది. సమ్మిళిత ఆర్థికవృద్ధికి ఆటంకం కలిగించింది. అలాంటి పరిస్థితుల లో జాతీయీకరణ ద్వారా ప్రభుత్వం, బ్యాంకులలో డబ్బులను నిర్లక్ష్యం చేయబడిన రంగాలకు మళ్లించగలదని, తద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించవచ్చని పేదరికాన్ని తగ్గించవచ్చని భావించారు. ప్రధానంగా నికర డిపాజిట్లు 50 కోట్లకు మించిన 14 ప్రైవేట్ షెడ్యూల్డ్ బ్యాంకులను జాతీయీకరించారు. వీటిలో అల్లాహాబాద్ బ్యాంక్, బాంక్ ఆఫ్ బరోడా, బాంక్ ఆఫ్ ఇండియా, బాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ శాఖల విస్తరణ
ఈ బ్యాంకులు దేశ డిపాజిట్లలో 85వరకూ నిర్వహిస్తున్నట్లుగా ఉండటంతో వాటి జాతీయీకరణ ద్వారా ప్రభుత్వానికి అధిక ఆర్థిక నియంత్రణ కలిగింది. బ్యాంకింగ్ రంగాన్ని సామాజిక అభివృద్ధికి వినియోగించే దిశగా ఇది మలుపు తీసుకొచ్చింది. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా కొన్ని ప్రధాన లక్ష్యాలు చేరుకోవడం జరిగింది. వ్యవసాయ రంగా నికి, చిన్న పరిశ్రమలకు, సామాజికంగా వెనుకబడిన వర్గా లకు రుణాలందింపు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ శాఖల విస్తరణకు ఇది నాంది పలికింది. జాతీయీకరణ వల్ల ప్రధానంగా నాలుగు ప్రధాన మార్పులుచోటుచేసుకున్నాయి. ఒకటి గ్రామీణ బ్యాంకింగ్ విస్తరణ, రెండోది వ్యవసాయ, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజులకు రుణాల లభ్యత, మూడోది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకుల మద్దతు. నాలుగోది మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఇతర బహిష్కృత వర్గాల ఆర్థిక చేర్పు. 1969 నాటికి దేశవ్యాప్తంగా 8,200 బ్యాంక్ శాఖలే ఉండగా, 1991 నాటికి వాటి సంఖ్య 60 వేలు దాటింది. ఇందులో 30 వేలకు పైగా గ్రామీణ శాఖలు. వ్యవసాయరంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల శాతం 1969లో 2.2 ఉండగా, 1980 నాటికి 15.8 కి పెరగ డం గమనార్హం. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు మొదటిసారిగా అధికారిక ఆర్థిక వ్యవస్థకు చేరువయ్యా యి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, విద్యా రుణాలు మొదలైనవి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అమలవుతూ వచ్చాయి. ఇక ఇందిరా గాంధీ పాలనకు ఇది రాజకీయంగా పెద్దబలాన్ని ఇచ్చింది. బ్యాంకు ల జాతీయీకరణ పేద ప్రజల్లో మద్దతును పెంచడంతో పాటు, ఆమెను సామాజిక న్యాయమూర్తిగా ప్రజల్లో ప్రతి ష్ఠించేందుకు దోహదపడింది. అయితే 1970లో సుప్రీంకోర్టు ఈ ఆర్డినెన్స్ ను కొంతవరకూ చట్టవిరుద్ధంగా ప్రకటించడం తో, ప్రభుత్వం చట్ట సవరణ చేసి తిరిగి జాతీయీకరణను అమలు చేసింది. దీనికితోడు

1980లో మరోసారి ఆరు ప్రైవేట్ బ్యాంకులను జాతీయీకరించడం జరిగింది. వీటితో కలిపి ప్రభుత్వ యాజమాన్యంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల సంఖ్య 20కి చేరింది. అయితే జాతీయీకరణ తరువాత కూడా సమస్యలు లేవని చెప్పలేం. బ్యాంకుల్లో రాజకీయ దుర్వినియోగం, సంక్షేమ పథకాల పేరిట నష్ట రుణాల మాఫీ, నిర్వాసిత ఆస్తుల శాతం పెరగడం, ప్రభుత్వ నియామకాల వల్ల పరిపాలనలో నైపుణ్యాల కొరత వంటి అంశాలు వ్యాపించాయి. అయినా ఇవన్నీ కలిపి చూసినపు డు. జాతీయీకరణ ద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు ఒక సుదీర్ఘ, సామాజిక ధోరణిలో దిక్సూచి చూపడం జరిగింది. దేశంలో సగానికి పైగా జనాభా బ్యాంకింగ్ సేవలకు మించి ఉండే స్థితిలో ఉండడం ఈ విధానానికే ఫలితం. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రైవేట్ బ్యాంకులకు తిరిగి ప్రవేశం లభించినా, జాతీయీకరణ ద్వారా ఏర్పాటైన బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు, సామాజిక దృక్కోణం భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపాయి. నేటి ఆర్థికచర్చల్లో బ్యాంకుల విలీనాలు, సంస్థాగత పునఃనిర్మాణం, డిజిటల్ బ్యాంకింగ్ వంటి అంశాలు ముందుకు వస్తున్నా వాటికి బీజం వేసింది 1969లో తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణే. ఇది కేవలం పాలనా నిర్ణయం కాదు, దేశ ఆర్థిక ప్రణాళికలో ఒక మైలు రాయిగా నిలిచింది. పేదల ఆర్థిక చేర్చును, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న విధానాల మొదటి మెట్టు ఇదే. ఇలాంటి చర్యల ద్వారానే సమతా, సమగ్ర అభివృద్ధికి దారులు వెలుస్తాయి.

Read also:hindi.vaartha.com
Read also:Young Leaders of India : నవ భారత నిర్మాణానికి యువతే కీలకం