తెలంగాణా(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Elections) బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయం రాజకీయ, సామాజిక, చట్టపరమైన చర్చలకు దారి తీసింది. ఈ నిర్ణయం కేంద్రరాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ సవరణలు, న్యాయ సమీక్షలు, కులగణన ద్వారా సేకరించి న గణాంకాల వివరాలతో ముడిపడి ఉంది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసే తీర్పులు ఉన్నందున ఏదైనా రాష్ట్రం పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేసే ప్రయ త్నం చేసినపుడు అవి న్యాయ సమీక్షకు వెళ్లే అవకాశం ఉం టుంది. అయితే, ఈ పరిమితిని అధిగమించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తరుపున కేవియేట్ పిటిషన్ వేసి నా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ ఆశావహ అభ్యర్థులు ఈ నిర్ణయంపై హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు వెళ్ళినపుడు న్యాయ సమీక్షకు గురయ్యే అవకాశం లేకపోలేదు.
రిజర్వేషన్కు చట్టబద్ధ రక్షణ
రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్కు చట్టబద్ధ రక్షణ లభిస్తుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. 2024లో నిర్వహించిన కులగణన ఈ రిజర్వేషన్ పెంపులో కీలక పాత్ర పోషించనుంది. ఈగణన ప్రకారం, తెలంగాణ జనాభా 3.70 కోట్లుగా, బిసిలు 56.33 శాతంగా నమోదైంది. ఇందులో ముస్లింలు 10.08 శాతం, హిందువులు 46.25 శాతం ఉన్నారు. ఎస్సీ కేటగిరి 17.43. శాతం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) 10.45 శాతం, ఓపెన్ కేటగిరీ 15.79శాతం, ముస్లింలు 2.48 శాతం ఉన్నారు. మొత్తం ముస్లింజనాభా 12.56 శాతం ఉన్నారు. ఈ సర్వేలో 3.54 కోట్ల మంది పాల్గొన్నారని మరో 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారని మొత్తం రాష్ట్ర జనాభా 3.70 కోట్లని ప్రభుత్వం తెలిపింది. ఈ గణాంకాలపై వివిధ కుల సంఘాలు సందే హాలు వ్యక్తం చేస్తున్నాయి.

సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం
2014లో చేసిన సమగ్ర కుటుం బ సర్వేలో ముస్లింలను బీసీల్లో కలిపి లెక్కించారా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 2001-2011 దశాబ్దవృద్ధి రేటు ను, రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు కార్డుల్ని పరిగణలోకి తీసుకున్నా రాష్ట్ర జనాభా నాలుగు కోట్లకు పైగా ఉంటుందన్నది వారి వాదన. 2011 జనగణన ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు, 2014 సమగ్ర కుటుంబ సర్వేప్రకారం 3.63 కోట్లుగా ఉంది. అంటే దాదాపు మూడున్నర ఏళ్లలో 13 లక్షల వరకు జనాభా పెరిగింది. కానీ, 2024 రాష్ట్ర జనాభా 3.70 కోట్లుగా తెలిపారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో కేవలం 7లక్షల జనాభా పెరిగినట్లు ఈ సర్వేద్వారా తెలుస్తోంది. ఇక్కడే పలు అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం ఒకవేళన్యాయ సమీక్షకు వెళ్తే న్యాయస్థానాల్లో ఈ డేటా సమర్పించినప్పు డు. ఈ సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
కేంద్రఆమోదం, రాజ్యాం గ సవరణ అవసరం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2025 మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచే బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లు 50 శాతం పరిమితిని మించడం వల్ల, కేంద్రఆమోదం, రాజ్యాం గ సవరణ అవసరం. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలు చేయడం న్యాయస్థానాల్లో నిలదొక్కుకోవడం కష్టమని ప్రతి పక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు కుల సంఘాల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు 1992 ఇంద్రా సాహ్నీకేసులో రిజర్వేషన్ను 50శాతం గా పరిమితం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ పరిమితిని మించవచ్చని, దీనికి శాస్త్రీయమైన గణాంకా లు అవసరమని తీర్పును ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో రిజర్వే షన్ పరిమితిని మించినప్పుడు న్యాయస్థానాలు జోక్యంచేసు కున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2021లో మహారాష్ట్ర లో మరాఠా రిజర్వేషన్ 50 శాతం పరిమితిని మించడంతో సుప్రీంకోర్టు దానిని రద్దుచేసింది.
కులగణన డేటా సమర్ధనీయం కాదని పేర్కొంది
అసాధారణ పరిస్థితులను రుజువు చేయడంలో విఫలమైందని తీర్పు ఇచ్చింది. 2024 లో బీహార్ లో 65శాతం రిజర్వేషన్ను పాట్నా హైకోర్టు రద్దు చేసింది. కులగణన డేటా సమర్ధనీయం కాదని పేర్కొంది. తమిళనాడు 69 శాతం రిజర్వేషను 1994లో 9వ షెడ్యూ ల్లో చేర్చడం ద్వారా చట్టబద్ద రక్షణ పొందింది. ఇదే విధ మైన రాజ్యాంగ రక్షణ కల్పించాలని బిసి కుల సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే గతంలో వెలువ డిన తీర్పుల వల్ల తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ అమలు న్యాయస్థానాల్లో నిలదొక్కుకోవడం కష్టమని వాపో తున్నారు. కేంద్రం 2026లో జనగణనతో పాటు కులగణన చేపట్టనుంది.
తెలంగాణ కులగణన గణాంకాలు
తెలంగాణ కులగణన గణాంకాలు, కేంద్రం సేకరించే డేటాతో సరితూగకుంటే, రిజర్వేషన్ అమలు సంక్షి ష్టమవుతుంది. కేంద్ర ఆమోదం లేకుండా రాష్ట్రం ఏకపక్షం గా చేసే ప్రయత్నాలు చట్టపరమైన సమస్యలను తెచ్చిపెడ తాయి. రాష్ట్రం తన డేటాను కేంద్రానికి సమర్పించి, 9వ షెడ్యూల్లో చేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు పార్టీలు అధికారం లో ఉన్నపుడు ఈ ప్రక్రియను ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడం లేదా న్యాయ సమీక్షకు వెళ్ళినపుడు శాస్త్రీయమైన గణాంకాల్ని సమర్పించడం ద్వారా ఈ రిజర్వేషన్ చట్ట బద్ధమైన రక్షణ పొందే అవకాశం ఉంటుంది .
Read hindi news: hindi.vaartha.com
Read Also: England: ఇంగ్లండ్‌కు ఐసీసీ బిగ్ షాక్..