టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె సినిమా లేదా ప్రాజెక్టుల గురించి కాదు, ఆరోగ్య సమస్య కారణంగా. సమంత ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేయడంతో ఆమె అభిమానులు కంగారుగా మారారు. ఈ ఫొటోలో సమంత చేతికి సెలైన్ ఎక్కిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. “మళ్లీ ఏం జరిగింది? సమంత ఆరోగ్యం ఎలా ఉంది?” అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సమంత, దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి కృషి చేస్తోంది. ఆమె 2022లో ఈ వ్యాధి గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి అనేక చికిత్సలు తీసుకుంటూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే పనిలో ఉంది. చికిత్సల కారణంగా కొంత సమయం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత మళ్లీ తన కెరీర్‌ను పునరుద్ధరించేందుకు కష్టపడుతోంది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఇక టాలీవుడ్‌లో కూడా ఆమె నెమ్మదిగా తిరిగి సినిమాలను అంగీకరిస్తోంది. ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.అంతేకాదు, సమంత తొలిసారి నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. ‘మా ఇంటి బంగారం’ అనే ప్రాజెక్టును సమంత నిర్మిస్తుండగా, ఇందులో ఓ ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించనుంది. అంతేకాదు, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో తన ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన సమంత, తొలి సినిమా ‘శుభం’ షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించింది. తాజాగా ఆసుపత్రి నుంచి తన ఫోటోను పోస్ట్ చేసిన సమంత, దానికి ఓ మిస్టీరియస్ క్యాప్షన్ జోడించింది. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన సమంత, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఈ దశ నా జీవితంలో ఒక పాఠం కానీ నేనింకా బలంగా తిరిగి వస్తా” అంటూ చెప్పిన మాటలు అభిమానులకు స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటివరకు సమంత తన ఆరోగ్యంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా సమంత ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను ఆమె స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.