Samantha : లైఫ్ లో రూల్స్ నచ్చవని వెల్లడి :సమంత ప్రముఖ నటి సమంత ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సందడి చేస్తున్నారు.భారతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న ఆమె, అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సమంత తన జీవిత దృక్పథం గురించి స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.విజయాన్ని కేవలం గెలుపుతో పరిమితం చేయకూడదని, ప్రయత్నమే అసలైన విజయమని ఆమె అన్నారు. వ్యక్తిగతంగా నచ్చిన విధంగా జీవించడమే నిజమైన సక్సెస్ అని అభిప్రాయపడ్డారు. అవార్డులు, రివార్డులు మాత్రమే విజయాన్ని నిర్వచించవని స్పష్టం చేశారు.”నా జీవితంలో నాకు నచ్చినట్లు జీవించాలని అనుకుంటాను.

నియమ నిబంధనలు నన్నులేవు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలనేదే నా ధ్యేయం.ఆడపిల్లగా జన్మించాం కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అనే ఆంక్షలు నాకు ఇష్టం లేదు.అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనే తపన ఉంది” అని సమంత తెలిపారు.సిడ్నీ పర్యటన సందర్భంగా ఆమె అక్కడి యువతతో ముచ్చటించారు. తన అనుభవాలను పంచుకుంటూ, సినీ రంగంలో వచ్చిన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నానో వివరించారు. సమంత వ్యాఖ్యలు యువతకు ప్రేరణగా మారాయి.