samanthasurekha

Samantha: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన సమంత

టాలీవుడ్ నటి సమంత ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన గురించి చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు ఆమె తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే తాను తన జీవితంలో ఎదురైన అన్ని సమస్యలను అధిగమించగలిగానని అన్నారు ఈ విషయంపై తన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్ని ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇంటర్వ్యూలో ఒక విలేకరి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా సమంత తనకు అందుతున్న మద్దతు గురించి ప్రస్తావిస్తూ తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన మీద ఉన్న ప్రేమ నమ్మకమే ప్రధాన కారణమని తెలిపారు ఇండస్ట్రీలోని ప్రముఖులు తనకు అండగా ఉన్నందుకు వారి మద్దతు లేకపోయి ఉంటే తాను ఎదుర్కొన్న సమస్యలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగేదని ఆమె పేర్కొన్నారు ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ ద్వేషపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని నెగటివిటీకి లొంగకుండా ముందుకు సాగుతానని వివరించారు

అలాగే సమంత సిటాడెల్ సిరీస్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఈ సిరీస్‌లో తనకు పాత్ర అందించిన దర్శకులు రాజ్ అండ్ డీకే మొదట తనను సంప్రదించగా తాను ఆ పాత్ర చేయలేనని వారి ముందు చెప్పానని గుర్తు చేశారు ఆమె వారిని నలుగురు ఇతర హీరోయిన్ల పేర్లు సిఫార్సు చేసినా వారు వినకపోవడంతో చివరికి తనే ఆ పాత్రను చేయవలసి వచ్చిందని చెప్పారు. తాను చివరికి ఆ పాత్ర చేయడం తన అదృష్టమని ఆమె అభిప్రాయపడ్డారు సమంత ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్ పాత్రలో నటించగా ఆమెతో పాటు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు ఈ సిరీస్‌ త్వరలో ఈ సంవత్సరం నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Related Posts
ఒకేరోజు పవన్, ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్న ముంబై బ్యూటీ
nidhi agarwal

ముంబైకి చెందిన అందమైన నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఆమెకు ప్రస్తుతం రెండు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బిగ్ Read more

“బ్రహ్మ ఆనందం” సినిమా – బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా?
"బ్రహ్మ ఆనందం" సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా?

బ్రహ్మ ఆనందం' – ఫస్ట్ డే కలెక్షన్స్ విశేషాలు బ్రహ్మ ఆనందం" సినిమా మూవీ అంచనా ప్రకారం 10 CR చేయొచ్చు అని మూవీ మేకర్స్ చెప్తున్నారు. Read more

Trisha Krishnan: ఏంటీ..! త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఈ ముద్దుగుమ్మలేనట
trisha

తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమలో అందాల తారగా పేరుపొందిన త్రిష ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది కెరీర్ Read more

NAGABANDHAM: చిరంజీవి క్లాప్‌తో ‘నాగబంధం’ చిత్రీకరణ ప్రారంభం
nagabandham

విరాట్ కర్ణ, "పెదకాపు" చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన నటిస్తున్న రెండో చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *