Salman Khan receives threats once again

Salman Khan : మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం..!

Salman Khan : బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి తీవ్ర బెదిరింపులు వ‌చ్చాయి. సల్మాన్‌ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు తాజాగా ఒక వాట్సాప్‌ సందేశం వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని అందులోని సారాంశం. ఈ సందేశం గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సందేశాన్ని పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో పడ్డారు.

Advertisements
మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు

సల్మాన్‌ఖాన్‌కు వై ప్లస్‌ సెక్యురిటీ

కాగా, సల్మాన్‌ఖాన్‌కు ఇలా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. గతేడాది సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. ఇటీవల సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్‌ సెక్యురిటీని నియమించింది. ఈ క్రమంలోనే ఆయన భారీ భద్రత నడుమ షూటింగ్స్‌, పబ్లిక్‌ ఈవెంట్స్‌కు హాజరవుతున్నారు.

Related Posts
భారతదేశం అడవి మరియు చెట్ల విస్తీర్ణంలో భారీ వృద్ధి
Forest

భారతదేశం చెట్ల మరియు అటవీ విస్తీర్ణంలో మంచి పెరుగుదల సాధించినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR 2023) ప్రకారం, 2021 Read more

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!
Vistaras Delhi London flig

గత కొద్దీ రోజులుగా వరుసగా విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు పాలనా విమాననానికి బాంబ్ పెట్టినట్లు మెసేజ్ లు Read more

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..?
cm revanth delhi

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన కేంద్ర మంత్రులను కలుస్తారని సమాచారం. మరోవైపు ఏఐసీసీ నేతలతోనూ Read more

ఈ ఏడాది రిటైర్మెంట్ పలికిన క్రికెటర్లు
India players who have Reti

ఈ ఏడాది క్రికెట్ ప్రపంచంలో ఎంతోమంది ప్లేయర్లు తమ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికారు. వీరిలో భారత క్రికెటర్లు అశ్విన్, శిఖర్ ధవన్ వంటి దిగ్గజాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×