salman 5cr

సల్మాన్ బతికుండాలంటే రూ. 5 కోట్లు ఇవ్వండి – పోలీసులకు మెసేజ్

సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్‌ ఎవరిది, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు.

‘లైట్గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Related Posts
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..!
Surrender of a key Maoist leader..!

లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర నిర్భందాలు పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ Read more

పుష్ప 2 మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటి సోదాలు!
పుష్ప 2 మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటి సోదాలు!

ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌పై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం వరుస సోదాలు నిర్వహించారు. ఇందులో మైత్రి మూవీ మేకర్స్ Read more

OG మూవీలో అకీరా నందన్..?
akira og

పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో 'OG' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ Read more

కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా: పవన్ కల్యాణ్ స్పందన
కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా పవన్ కల్యాణ్ స్పందన

కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా: పవన్ కల్యాణ్ స్పందన భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుని మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా అభినందనల Read more