sajjala

నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న సజ్జల..

అమరావతి: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈరోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సాయంత్రం 4 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు సజ్జల రానున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించే క్రమంలో సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటన వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను పలుమార్లు విచారించారు.

Related Posts
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్
50 percent increase Ticket rates in Telangana RTC buses!

హైదరాబాద్‌: సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ Read more

నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట: టీటీడీ చైర్మన్‌
ttd

టీటీడీలో జరిగిన ప్రాణనష్టంతో భక్తుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. దీనితో నష్ట నివారణచర్యలకు టీటీడీ అధికారులు దిగారు. డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని Read more

Maheshwar Reddy: రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Congress government debt is over Rs. 1700 crore per day.. Alleti Maheshwar Reddy

Maheshwar Reddy : తెలంగాణ బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు Read more

మిస్ వరల్డ్ – భారత్ తరఫున పోటీలో ఈమెనే
nandini gupta

ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ మిస్ వరల్డ్ ఈసారి భారతదేశంలోనే జరుగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుండి 31 వరకు Read more