sajjala

నేను దేశం వదిలి పారిపోవడం లేదు – సజ్జల

వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మంగ‌ళ‌గిరి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొన్న పోలీసులు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

ఈ నోటీసుల పై సజ్జల స్పందించారు. తానేమీ దేశం వదిలి పారిపోలేదని, ఎందుకు నోటీసుల పేరుతో హడావుడి చేస్తున్నారని అసహనం ప్రదర్శించారు. విదేశాల్లో వారం రోజుల పర్యటన అనంతరం తిరిగొచ్చానని, కానీ నోరుందని అడ్డగాడిదల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

“పారిపోనివ్వం అంటున్నారు… ఇక్కడ ఎవరు పారిపోతున్నారు? ఎందుకు పారిపోతారు? గతంలో చంద్రబాబు వ్యవహారంలో నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్టు అందరూ పరారవుతారా? తప్పులు చేసిన వాళ్లు కదా పారిపోయేది? మీరు పెట్టింది తప్పుడు కేసు… ఆ విషయం ఎలాగూ న్యాయస్థానంలో నిరూపితమవుతుంది. బలవంతం చేసి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించినా, చివరికి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పనిలేదు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం’ అన్నారు.

Related Posts
రైతుల నిరసనలు: పంజాబ్‌లో బంద్
రైతుల నిరసనలు: పంజాబ్‌లో బంద్

రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా పంజాబ్ బంద్‌కు Read more

రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

అవినీతి ఆరోపణలపై విచారణలో ప్రజాధనాన్ని వృథా చేయడం కంటే అవినీతి కేసులను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి న్యాయమూర్తి ఎదుట లైవ్ లై డిటెక్టర్ పరీక్ష చేయించాలని బీఆర్ఎస్ Read more

సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు
manchuvishnu

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల Read more

చిరంజీవి వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కామెంట్స్
Chiru Laila

సినీ నటుడు చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూనీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, Read more