భారత బ్యాడ్మింటన్ కు గర్వకారణమైన స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఏడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. 2018లో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట, ఏడేళ్ల అనంతరం విడిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా ద్వారా వెల్లడించడంతో అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది.జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది అంటూ ఆమె షేర్ చేసిన సందేశంలో ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదల కోసం విడిపోతున్నామని పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత కశ్యప్ పారుపల్లి, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. తాము ప్రశాంతత, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకున్నామని తెలిపింది. సైనా (Saina Nehwal) అభిమానులను తమ గోప్యతను గౌరవించాలని కోరారు. అయితే కశ్యప్ ఈ విషయం మీద ఇప్పటివరకు స్పందించలేదు.
ఘనంగా వివాహం
సైనా, కశ్యప్‌ల పరిచయం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ సమయంలో మొదలైంది. సహచర శిక్షణ క్రమంగా స్నేహంగా మారి, చివరికి ప్రేమలో మారింది. 2018లో ఇద్దరూ గచ్చిబౌలిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ (Badminton) ప్రపంచంలో ఈ జంటకు విశేష గౌరవం ఉంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత, మాజీ ప్రపంచ నంబర్ వన్ అయిన సైనా, గత కొంతకాలంగా గాయాలతో బాధపడుతోంది. 2023 జూన్‌లో ఆమె చివరిసారి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడగా, ఆ తర్వాత ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇది ఆమె ప్రొఫెషనల్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

కొత్త బాటలో ముందుకు సాగాలని
కశ్యప్ తన కాంపిటీటివ్ కెరీర్‌కు ముగింపు పలికి, కోచింగ్‌కు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం గచ్చిబౌలిలో గోపీచంద్ అకాడమీలో యువ బ్యాడ్మింటన్ ఆటగాళ్లను తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) లో పతకాలు సాధించి, భారత క్రీడా చరిత్రలో తనదైన స్థానం పొందాడు.ఈ విడాకుల ప్రకటన తర్వాత, సోషల్ మీడియాలో సైనా పట్ల అనేకమంది అభిమానులు తమ మద్దతు తెలిపారు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు, ఆమె జీవితం కొత్త బాటలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు మెసేజ్‌లు పెరుగుతున్నాయి.సైనా – కశ్యప్ విడిపోవడం నిరాశ కలిగించినా, ఇది వారి వ్యక్తిగత శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయం. ఇద్దరూ భారత క్రీడలకు చేసిన సేవ మరవలేనిది. భవిష్యత్తులో వీరి జీవితం ప్రశాంతంగా సాగాలని, వారు ఇష్టమైన మార్గాల్లో ముందుకు సాగాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
బ్యాడ్మింటన్ రాణిగా ఎవరు పిలవబడుతున్నారు?
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ రాణిగా పిలవబడుతున్నారు. 2025 మార్చి 17న ఆమె 35వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. హర్యానాకు చెందిన సైనా, తన కుటుంబం హైదరాబాద్‌కు వలస వెళ్లిన తర్వాత ఎనిమిదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచారు.
సైనా (లేదా) సింధు వీరిలో ఎవరు ఉత్తములు?
సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఇద్దరూ భారత బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే, ర్యాంకింగ్స్, మెడల్స్ పరంగా చూస్తే సింధు కొద్దిగా ముందంజలో ఉన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 6వ స్థానంలో ఉండగా, సైనా 9వ స్థానంలో ఉన్నారు. ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకాన్ని గెలుచుకోగా, సింధు రజత పతకం సాధించారు.
Read hindi news: hindi.vaartha.com