SA20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన ఆటగాడి గాయంతో షాక్‌కు గురైంది. జట్టుకు కీలకమైన ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ గాయం కారణంగా ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ గాయం వల్ల జోబర్గ్ సూపర్ కింగ్స్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కూడా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా, కోయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చేరే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ స్నాయువు గాయంతో పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కోయెట్జీ దూరమవ్వగా, తాజా సమాచారం ప్రకారం అతను ఇక సీజన్‌లో ఆడలేడని నిర్ధారించారు.
ఈ గాయం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతని ఎంపికపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంతకుముందు, వెన్ను సమస్య కారణంగా ఎన్రిక్ నోర్కియా జట్టుకు దూరమవ్వగా, అతని స్థానాన్ని భర్తీ చేయడంలో గెరాల్డ్ కోయెట్జీ ప్రధాన అభ్యర్థిగా కనిపించాడు. కానీ ఇప్పుడు కోయెట్జీ గాయం కూడా దక్షిణాఫ్రికా టీమ్‌ను కుదిపేస్తోంది. SA20 లీగ్ ముగిసే వరకు కోయెట్జీ గాయం పరిస్థితిపై స్పష్టత రాలేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది.ఐసీసీకి చివరి జట్టు జాబితాను సమర్పించాల్సిన తేదీ ఫిబ్రవరి 11. ఈ లోపు కోయెట్జీ గాయం నుంచి కోలుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు.
నోర్కియా లేని లోటును పూరించడంలో అనుభవజ్ఞుడైన పేసర్లకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.కెప్టెన్ టెంబా బావుమా నేతృత్వంలో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ప్రకటించబడింది. ఇందులో టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే, నోర్కియా, కోయెట్జీ గాయాలు జట్టుకు ప్రధాన బలహీనతగా మారాయి.SA20 లీగ్‌తో పాటు రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గాయపడిన ఆటగాళ్ల రికవరీ కీలకం కానుంది. టీమ్ బలాన్ని పునరుద్ధరించేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ ముందడుగులు వేస్తోంది.