Telugu News, Telugu News online, Telugu News Today, Latest News in Telugu, Google News in Telugu, Ap News in Telugu, Breaking News in Telugu, Paper Telugu News, Telugu News Paper, Today News
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది.
తొలి రోజున దాదాపు 18180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది.
జిల్లాల వారిగా విడుదలైన రైతుభరోసా నిధుల..
ఆదిలాబాద్ జిల్లా: 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు రూ.14.49 కోట్లు.. భద్రాద్రి కొత్తగూడం జిల్లా: 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు.. హన్మకొండ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,545 మంది రైతులకు రూ.14.30 కోట్లు.. జగిత్యాల జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు.. జనగామ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 మంది రైతులకు రూ.15.91 కోట్లు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 మంది రైతులకు రూ.8.67 కోట్లు.. జోగులాంబ గద్వాల జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 మంది రైతులకు రూ.12.47 కోట్లు.. కామారెడ్డి జిల్లా: 22 మండలాల్లోని 24 గ్రామాలకు చెందిన 9,062 మంది రైతులకు రూ.8.35 కోట్లు.. కరీంనగర్ జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 మంది రైతులకు రూ.15.96 కోట్లు.. ఖమ్మం జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు రూ.28.42 కోట్లు.. కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 మంది రైతులకు రూ.8.62 కోట్లు.. మహబూబాబాద్ జిల్లా: 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 మంది రైతులకు రూ.18.14 కోట్లు.. మహబూబ్ నగర్ జిల్లా: 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575 మంది రైతులకు రూ.17.27 కోట్లు.. మంచిర్యాల జిల్లా: 16 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 7,143 మంది రైతులకు రూ.8.72 కోట్లు.. మెదక్ జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 మంది రైతులకు 14.06 కోట్లు.. మేడ్చల్ జిల్లా: 5 మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 2,706 మంది రైతులకు రూ.3.14 కోట్లు.. ములుగు జిల్లా: 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు రూ.8.26 కోట్లు.. నాగర్ కర్నూల్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 16,806 మంది రైతులకు రూ.23.05 కోట్లు.. నల్లగొండ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు.. నారాయణపేట జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 మంది రైతులకు రూ.13.87 కోట్లు.. నిర్మల్ జిల్లా: 18 మండలాల్లోని 18 గ్రామాలకు చెందిన 7,912 మంది రైతులకు రూ.10.56 కోట్లు.. నిజామాబాద్ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు.. పెద్దపల్లి జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,885 మంది రైతులకు రూ.10.14 కోట్లు.. రాజన్న సిరిసిల్ల జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 9,724 మంది రైతులకు రూ.12.26 కోట్లు.. రంగారెడ్డి జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 15,597 మంది రైతులకు రూ.20.32 కోట్లు.. సంగారెడ్డి జిల్లా: 25 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 19,933 మంది రైతులకు రూ.24.15 కోట్లు.. సిద్దిపేట జిల్లా: 26 మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 31,170 మంది రైతులకు రూ.36.76 కోట్లు సూర్యాపేట జిల్లా: 23 మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన 29,352 మంది రైతులకు రూ.37.84 కోట్లు.. వికారాబాద్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 8,609 మంది రైతులకు రూ.11.18 కోట్లు.. వనపర్తి జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 9,441 మంది రైతులకు రూ.12.25 కోట్లు.. వరంగల్ జిల్లా: 11 మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11,386 మంది రైతులకు రూ.12.86 కోట్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా: 17 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 17,576 మంది రైతులకు రూ.26.95 కోట్లు..
నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అదిగో..ఇదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగకపోవడం Read more
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ శనివారంనాడు BRICS దేశాలకు (బ్రాజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) అమెరికా డాలర్ స్థానంలో కొత్త వాణిజ్య కరెన్సీని ప్రవేశపెట్టడానికి Read more
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్, నటాషా, ఆర్టీజీఎస్ సీఈవో దినేశ్, ఐఏఎస్ అధికారి, ఏపీ ఐటీ, విద్యాశాఖ Read more
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గౌహతిలో కేసు నమోదు అయింది. గాంధీ చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో Read more