Thummala Nageswara Rao

ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.

తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఆ రోజు సెలవు దినం కావడంతో, మరుసటి రోజు ఒక్కో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా నిధులను చెల్లించారు. 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో రూ. 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి మొదటి విడతగా రూ.6 వేల పెట్టుబడి సాయం అందించింది. అయితే ఆ రోజు కేవలం మండలానికి ఒక గ్రామానికి చొప్పున మాత్రమే పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేసారు . మిగితా గ్రామాల్లోని రైతులకు మాత్రమే భరోసా నిధులు రాలేదు. అయితే ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తాజా ప్రకటన చేసారు. దీంతో ఈరోజు నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ను ప్రారంభంకానుంది.

Advertisements
thummala nageswara rao.jpg

రైతు భరోసా నిధులు ఈ రోజు నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మొదటి విడతగా ఎకరం వరకు సాగు భూమి ఉన్న దాదాపు 17.03 లక్షల రైతుల ఖాతాల్లో బుధవారం నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధుల పంపిణీ జరుగుతున్నదని ఆయన తెలిపారు. రైతు భరోసా స్కీం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

Related Posts
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. Read more

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి సిద్ధమవుతూ, "రీడెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్" పేరుతో డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది. కొత్త భవన్ నిర్మాణాన్ని మొత్తం Read more

బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చ
kcr erravalli

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ Read more

MLC Elections : ఓటు వేయ‌వ‌ద్దంటూ కార్పొరేట‌ర్లుకు బిఆర్ఎస్ ఆదేశాలు
బిఆర్ఎస్ ఆదేశాలు

హైదరాబాద్‌ లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న జరగనున్న Read more

×