Rythu Bharosa for farmers who have less than 3 acres from today!

నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా !

రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ

హైరదాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. ఈ మేరకు తాజాగా వ్యవసాయ శాఖ ప్రకటన చేసింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమకానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు వేశారు.

Advertisements
image

ప్రభుత్వం ఇప్పటికే ఒక ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,126 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండెకరాల భూముల గల రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. మొత్తంగా రైతు భరోసా కింద రూ. 2218 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈరోజు నుంచి మూడు ఎకరాలు గల రైతుల ఖాతాల్లో డబ్బులు చేయనుంది. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో ఈ డబ్బలు జమ అవుతాయి. రైతులు బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక గతంలో రైతు బంధు వచ్చిన రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

గతంలో పంట పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పేరుతో అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు కూడా పెంచారు. దీంతో ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో రూ. 6వేలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద కింద రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది. రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

Related Posts
రేపు కేంద్ర కేబినెట్ భేటీ..
Central cabinet meeting tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక Read more

Revanth Reddy : రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్
Revanth Reddy రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా అడవిని ధ్వంసం చేస్తున్నారు కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా కంచ గచ్చిబౌలి అడవుల నిర్మూలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యలు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

కోహ్లి ఈజ్ బ్యాక్
kohli

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి ఫామ్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గత కొన్ని నెలలుగా అతని ప్రదర్శన అంతగా మెరుగ్గా Read more

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
vamshi 2nd day

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి చుక్కెదురైంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్‌ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ Read more

×