Rs. 31,600 crore for the construction of Amaravati.. Minister Narayana

Minister Narayana: అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు : మంత్రి నారాయణ

Minister Narayana: శాసనమండలిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31,600 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు కలిపి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ.15వేల కోట్లు, జర్మన్‌కు చెందిన బ్యాంకు కేఎఫ్‌ డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్లు రుణం తీసుకుంటున్నట్టు తెలిపారు.

అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు

ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తాం

అమరావతికి రైల్వే ట్రాక్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేస్తుందని, ట్రాక్‌ ఏర్పాటుకు భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతి సెల్ఫ్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజలు చెల్లించిన పన్నుల్లో పైసా కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.6వేల కోట్లు కేటాయించారని విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా.. కేంద్రం, బ్యాంకుల నుంచి నిధులు రాగానే తిరిగి రాష్ట్ర బడ్జెట్‌కు ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.

Related Posts
ఫ్రాన్స్ కు చేరుకున్న ప్రధాని మోడీ
PM Modi France

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కోసం ప్యారిస్‌కు చేరుకున్నారు. ఫిబ్రవరి 12 నుండి 14 వరకు ఫ్రాన్స్, అమెరికాల్లో ఆయన పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌లో రెండు Read more

కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్
అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ఎంట్రీ?

మరింత ముదిరిన శీష్‌మహల్ వివాదం దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది నెలలుగా చర్చనీయాంశంగా మారిన శీష్‌మహల్ వివాదం మరింత ముదిరింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఆధునీకరణ Read more

ఈసీ పై మళ్లీ అనుమానాలు
narendra modi kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. Read more

ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంది: ప్రధాని మోడీ
PM Modi Speaks On The India Century At NDTV World Summit

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంద‌ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *