cm chandrababu pension 1

పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు – సీఎం చంద్రబాబు

అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్య క్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Related Posts
స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ
Conduct an inquiry into skill development.. YCP MLC

అమరావతి: 2014 -19 లో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది. 2014-19 మధ్య జరిగినన్ని స్కాములు దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో Read more

జనవరి 22న సామ్‌సంగ్ మొబైల్ ఏఐ ఆవిష్కరణ
Samsung unveils Mobile AI on January 22

హైదరాబాద్‌: మరింత సహజమైన మరియు ఆకర్షణీయమైన ఏఐ కోసం సిద్ధంగా ఉండండి. గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి పరిణామం రాబోతోంది. మరియు ఇది మీరు ప్రతిరోజూ ప్రపంచంతో Read more

ఉచిత బస్సు ప‌థ‌కంలో కీల‌క నిర్ణ‌యం!
free bus

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్‌డీఏ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కం ఒక‌టి. దాంతో ఈ స్కీమ్ అమ‌లు ఎప్పుడెప్పుడా Read more

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు భేటీ
CM Chandrababu meets Union Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తొ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో Read more