భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1తో పూర్తైంది. ఈ నోటిఫికేషన్ కింద దాదాపు 32,438 గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 32,438 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు.ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23 నుంచి మార్చి 1, 2025వ తేదీ వరకు కొనసాగింది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఏవైనా పొరబాట్లు చేసి ఉంటే, వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. మార్చి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తులో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, మరోమారు అవకాశం ఇవ్వబోమని బోర్డు స్పష్టం చేసింది.
ఆర్‌పీఎఫ్ ఎస్సై ఫలితాలు విడుదల
రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సబ్ ఇన్‌స్పెక్టర్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే కట్‌ఆఫ్ మార్కులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో 452 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు గత మేలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించారు. తాజా లిస్టులోని వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి, తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

వెబ్‌సైట్
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ నియామక ప్రక్రియలో భాగంగా త్వరలో మరిన్ని ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంది. రైల్వే ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలిస్తూ అప్డేట్‌లను పొందాలి.