DK Shivakumar reacts on party change

పార్టీ మార్పు పై స్పందించిన డీకే శివకుమార్

కర్ణాటక: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలను ఆయన ఖండించారు. బీజేపీ వాళ్లే తనతో టచ్ లో ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీ నేతలే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ముందు బీజేపీ తన ఇంటిని సరిదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

పార్టీ మార్పు పై స్పందించిన డీకే

దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదు

ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదు అని పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్, కేంద్రహోంమంత్రి అమిత్ షా కలవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపైనే డీకే స్పందించారు. ఆ ప్రోగ్రాం రాజకీయం కాదని, ఆధ్యాత్మికమైనందని స్పష్టం చేశారు. సద్గురు ఆహ్వానిస్తేనే ఆ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పారు. ఆయన కావేరీ జలాల కోసం కూడా పోరాడుతున్నట్లు గుర్తుచేశారు.

ఇదే కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది

మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాగా.. ఆ ప్రోగ్రాంలో అమిత్ షాతో పాటు డీకే పాల్గొన్నారు. అయితే, డీకే బీజేపీకి దగ్గరవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇదే కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. కాగా.. బీజేపీ లీడర్, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో డీకే శివకుమార్‌ను పోల్చారు. అయితే, డీకే పార్టీ మారతారని వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలపై డీకే కూడా క్లారిటీ ఇచ్చారు.

Related Posts
12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు : నిర్మలా సీతారామన్‌
No tax up to 12 lakhs: Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. మధ్య తరగతి Read more

హీరో కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
kiccha sudeep lost his moth

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది, ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. వయసుతో సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని Read more

2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు : ఐరాస
India population will be 170 crores by 2061 .

చైనా జనాభా 2021 నుంచి క్రమంగా తగ్గుముఖం న్యూయార్క్‌: ప్రపంచ జనాభా ధోరణులపై ఐక్యరాజ్య సమితి అంచనాలు విడుదల చేసింది. 2061 నాటికి భారత్‌ జనాభా 170 Read more

ప్రొద్దుటూరులో నేడు సీఎం రేవంత్, చిరంజీవి
revanth

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో నేడు ప్రత్యేక వేడుక జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రముఖ సినీనటుడు చిరంజీవి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. Read more