రోజ్ మేరీ నూనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది.జుట్టుకు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.రోజ్ మేరీ ఆయిల్‌ను అలోవెరా జెల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనెలతో కలిపి ముఖానికి అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.రోజ్ మేరీ వాటర్‌ను జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాదు, రోజ్ మేరీ నూనె వాసన చూడడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, మెదడు శక్తిని పెంచుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కూడా కలిగి ఉంది.
రోజ్ మేరీ ఆయిల్
ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని మరింత మృదువుగా ఉంచుతుంది. అదేంటంటే ముఖ సౌందర్యానికి రోజ్ మేరీ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తాయి.
చర్మ సంరక్షణ
ఫేస్ మాస్క్ కోసం
ఒక టేబుల్ స్పూన్ అలొవెరా జెల్ తీసుకుని అందులో 6 చుక్కల రోజ్ మేరీ ఆయిల్ కలపండి.
బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
15-20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఈ పద్ధతిని రోజుకు ఒకసారి ఫాలో అయితే మంచి ఫలితం కనిపిస్తుంది.రోజ్ మేరీ నూనెను నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు. బాదం నూనె లేదా కొబ్బరి నూనెలో కొద్దిగా కలిపి ఉపయోగించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది-ఇది వాపు, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
మెదడుకు శక్తినిచ్చే నూనె – రోజ్ మేరీ నూనె వాసన చూడడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది.
రక్త ప్రసరణ పెంపు – ఇది చర్మానికి ఆక్సిజన్‌ను ఎక్కువగా అందించడంలో సహాయపడుతుంది.
జుట్టు సంరక్షణ
తలపై రక్త ప్రసరణను పెంచి జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది.హెయిర్ ఫాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది.
నల్లని, ఆరోగ్యవంతమైన జుట్టుకు సహాయపడుతుంది.

రోజ్ మేరీ నూనెను కొబ్బరి నూనెలో కలిపి తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మెరుగైన ఫలితం కనిపిస్తుంది.రోజ్ మేరీ నూనె ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా అనుకూలంగా పనిచేస్తుంది. ఇది ఓవరా ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించి, స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.ఈ మారుతున్న వాతావరణంలో రోజ్ మేరీ ఆయిల్ ఒక అద్భుతమైన సహజ ఉత్పత్తిగా పనిచేస్తుంది.
చర్మ సౌందర్యానికి
ఆరోగ్యానికి మరియు అందానికి ఎన్నో ప్రయోజనాలను అందించే అద్భుతమైన మూలిక. దీనిని నూనె, నీరు, పొడి రూపంలో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా రోజ్ మేరీ ఆయిల్ చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.