ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలామందిలో ఉండడం కామన్‌గా మారిపోయింది. అయితే వీటిలో ఉండే కెఫీన్ పదార్థం అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా “గులాబీ టీ” (Rose Tea) ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది.
ఎలా తయారు చేస్తారు గులాబీ టీ?
గులాబీ టీ తయారీకి సహజమైన ఎండబెట్టిన గులాబీ రేకులను ఉపయోగిస్తారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పాలీఫినాల్స్ మరియు ఔషధ గుణాల శక్తివంతమైన సమ్మేళనంతో తయారవుతాయి. గులాబీ రేకులను వేడి నీటిలో మరిగించి లేదా నానబెట్టి సుగంధిత, ఆరోగ్యవంతమైన టీగా తయారు చేస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు:
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కవచం
గులాబీ రేకుల్లో ఉన్న పాలీఫినాల్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి. ఇవి కణజాలాలను సురక్షితంగా ఉంచి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. గుండె సంబంధిత రుగ్మతల ముప్పును తగ్గిస్తాయి.
జీర్ణక్రియకు మేలు
ఈ టీ సహజ లాక్సేటివ్ గుణాన్ని కలిగి ఉండటంతో మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, ఆసిడ్ పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.
కాలేయం శుభ్రపరిచే గుణం
గులాబీ టీ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడం ద్వారా ఎంయూన్ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది
విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీరం రోగనిరోధకతను పెంచుతుంది. తరచుగా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడేవారికి ఇది చాలా ఉపయోగకరం.
వాపులు, నొప్పుల నివారణ
గులాబీ టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, మెడ లేదా బాడీ పెయిన్ వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
మహిళల ఆరోగ్యానికి వరం
రుతుక్రమ సమస్యల నివారణ: రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు మసిలి నొప్పిని తగ్గిస్తాయి.
హార్మోన్ సమతుల్యత: గులాబీ టీ తాగే అలవాటు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహకరిస్తుంది.
మనసు శాంతించడానికి సహాయపడుతుంది: గులాబీ పువ్వుల సహజ సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది నిద్రలేమితో బాధపడేవారికి మంచి సహాయం చేస్తుంది.

ఇతర ఉపయోగాలు
- గులాబీ టీ తాగడం వల్ల చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణజాలాన్ని రక్షిస్తాయి.
- కొవ్వు తగ్గించే గుణాలు ఉన్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మితంగా తీసుకుంటే బరువు తగ్గే ప్రయాణంలో తోడ్పడుతుంది.
- మౌత్ అల్సర్లు లేదా పేగు సమస్యలతో బాధపడేవారికి ఇది సహజ నివారణ.
ఎప్పుడు ఎలా తాగాలి?
రోజుకు రెండు కప్పుల వరకు తాగవచ్చు (ఉదయం ఖాళీ కడుపుతో, సాయంత్రం శాంతంగా ఉండే సమయంలో.
చక్కెరను కలపకుండా తాగితే మంచిది లేదా తేనె తక్కువగా కలిపి తీసుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలు లేదా ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్న వారు వైద్యుల సలహా తీసుకుని తాగడం మంచిది.
Read also: Tulasi: తులసి ఆకూల తో డయాబెటిస్ కంట్రోల్