భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation sindoor) తో ఆధునిక యుద్ధంలో డ్రోన్ల ప్రాముఖ్యం తెలిసివచ్చిందని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ భట్ (Anil Kumar Bhatt) అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు యుద్ధంలో అంతరిక్షం, సైబర్‌స్పేస్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ప్రతీ దేశం తమ ఆస్తులను అంతరిక్షంలో సురక్షితంగా దాచుకుంటుందని అంచనా వేశారు. యుద్ధంపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం అనేది చాలా తీవ్రమైన అంశమని, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే యుద్ధం చివరి ఎంపికగా ఉండాలని సూచించారు. ఈయన డోక్లామ్ ఉద్రిక్తతల సమయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌గా పని చేశారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) నేపథ్యంలో ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకమని అనిల్ భట్ (Anil Kumar Bhatt) స్పష్టం చేశారు. డ్రోన్ల సహకారంతో యుద్ధ ప్రయోగాల్లో విజయం సాధించడం సాధ్యపడిందని తెలిపారు.

మిలిటరీ ఆపరేషన్స్‌లో డీజీఎంఓ పాత్ర
“డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సైనిక కార్యక్రమాల విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. అది యుద్ధంలోనైనా, శాంతి చర్చల్లోనైనా ప్రణాళిక అమలు, పర్యవేక్షణ చేస్తుంటారు. కేవలం ఆర్మీతోనే కాకుండా మూడు విభాగాల మద్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమయంలో యుద్ధం ఒకే విధానంలో జరగడం లేదు. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో కలిపి సమన్వయం చేసుకోవడం చాలా అవసరం అని అనిల్ భట్(Anil Kumar Bhatt) , మాజీ డీజీఏంఓ అన్నారు.సైనిక ప్రణాళికలు రూపొందించడం, అమలు చేయడం, పర్యవేక్షించడం.యుద్ధం మరియు శాంతి చర్చల్లో సమన్వయం కల్పించడం. ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్‌లతో సమన్వయం అవసరం అని తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలు భూమిపైన మాత్రమే కాకుండా, అంతరిక్షం (స్పేస్), మరియు సైబర్‌స్పేస్‌లోనూ జరిగే అవకాశముందని చెప్పారు. దేశాలు తమ విలువైన ఆస్తులను అంతరిక్షంలో భద్రంగా నిల్వ చేసుకునే దిశగా ప్రయత్నిస్తాయని అభిప్రాయపడ్డారు.
భారత్‌కు డ్రోన్ ఉత్పత్తి సామర్థ్యం అవసరం
ఆపరేషన్ సిందూర్(Operation sindoor) లో పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ఇవ్వడంపైనా ఆయన మాట్లాడారు. తుర్కియే యుద్ధ సామాగ్రిని తయారు చేస్తుందని, చాలా దేశాలకు విక్రయిస్తుంటుందని చెప్పారు. ఇందులో భౌగోళిక రాజకీయ కారణాల కన్నా వ్యాపార ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. “భారత్‌కు యుద్ధంలో ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా డ్రోన్లు అవసరం పడుతాయి. ఇందులో చాలా వరకు ఒకసారి ఉపయోగించేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు అవసరం. ఈ మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత్ సామార్థ్యాన్ని పెంచుకోవాలి.” అని అనిల్ భట్ (Anil Kumar Bhatt) తెలిపారు. భారత్ తాను స్వయంగా డ్రోన్లు తయారు చేసే సామర్థ్యం పెంచుకోవాలి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా “మాస్ ప్రొడక్షన్” చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో సైనిక ఘర్షణలు మరింత సాంకేతికత ఆధారంగా జరగబోతున్నాయి. డ్రోన్లు, స్పేస్, మరియు సైబర్‌స్పేస్ ఆధారిత యుద్ధాల కోసం భారత్ ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ భట్ సూచించారు.