ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక తన ప్రతిభతో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇటీవల నైజీరియాలో జరిగిన ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్’ లో అన్షు ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ ఫెస్టివల్‌లో అన్షు మాలిక తన గ్లామర్‌తో, కాన్ఫిడెన్స్‌తో ఆకట్టుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ ఫోటోలు షేర్ చేసిన అన్షు, ఈ అనుభవం తనకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఫ్యాషన్ రంగంలో ఇది తన తొలి అనుభవమని, భవిష్యత్తులో ఇంకా గొప్ప అవకాశాలు అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పుకొచ్చారు. అన్షు మాలిక కేవలం ఫ్యాషన్ రంగంలోనే కాకుండా, వ్యాపారరంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఆమె తాజాగా ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు’ అందుకున్నారు. యువ తరానికి ఆదర్శంగా నిలుస్తున్న అన్షు, కొత్త తరహా ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.
తల్లి రోజా రాజకీయాల్లో ఎంత పేరు తెచ్చుకున్నారో, అన్షు కూడా తన రంగాల్లో విజయపథంలో సాగుతున్నారు. ఆమె సృజనాత్మకత, తన కష్టపడి పనిచేసే నైపుణ్యం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. మొత్తంగా, అన్షు మాలిక తాను ఎంట్రీ ఇచ్చిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.