हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Rohith Vemula Act : కర్ణాటకలో ‘రోహిత్ వేముల’ చట్టం.. అమల్లోకి వస్తే శిక్షలివే!

Sudheer
Rohith Vemula Act : కర్ణాటకలో ‘రోహిత్ వేముల’ చట్టం.. అమల్లోకి వస్తే శిక్షలివే!

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం (Karnataka State Government) విద్యా సంస్థల్లో కుల, మత, ఆర్థిక ఆధారిత వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం రూపొందించేందుకు సిద్ధమైంది. దీనికి “రోహిత్ వేముల చట్టం” అనే పేరు పెట్టనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కులవివక్ష కారణమని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో స్పందించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

బిల్లో ఉన్న ప్రధాన నిబంధనలు

ఈ చట్టం ప్రకారం SC, ST, OBC, మైనారిటీ విద్యార్థులపై ఏవైనా వివక్ష చూపితే నేరంగా పరిగణించి, నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. తొలిసారి నేరానికి పాల్పడితే ఏడాది వరకు జైలు శిక్షతో పాటు Rs.10,000 జరిమానా విధించవచ్చు. బాధిత విద్యార్థికి లక్ష రూపాయల వరకు నష్ట పరిహారం చెల్లించేలా కోర్టు నేరస్తుడిని ఆదేశించవచ్చు. అదే నేరం మళ్లీ చేస్తే శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.

విద్యా సంస్థలపై కూడా కఠిన చర్యలు

కేవలం వ్యక్తులకే కాకుండా, విద్యా సంస్థలు వివక్షకు పాల్పడినట్టుగా నిరూపితమైతే, ఆ సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ గ్రాంట్లు ఆపివేసే నిబంధన ఈ చట్టంలో ఉంది. ఇది విద్యా వ్యవస్థలో సమానత్వాన్ని స్థిరపరచడానికే కాక, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా కీలక అడుగుగా భావించబడుతోంది. రోహిత్ వేముల చట్టం (Rohith Vemula Act) అమలులోకి వస్తే, భవిష్యత్తులో విద్యా రంగంలో అసమానతలకు గట్టి అడ్డుకట్ట పడే అవకాశముంది.

Read Also : Hindi Language : హిందీ భాషపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870