ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటే మనందరికీ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, హాయిగా ఉండే వ్యక్తిగా గుర్తించబడతాడు. గ్రౌండ్‌లో ఆట తీరు ఎంత దూకుడుగా ఉంటే, బయట మాత్రం అంతకంటే ఎక్కువగా కూల్‌గా కనిపించే Rohit Sharma … ఇప్పుడు మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో మాత్రం మన హిట్‌మ్యాన్ రోహిత్ కొంచెం ఆగ్రహంగా కనిపిస్తున్నాడు! ఈ వీడియో చూసిన నెటిజన్లు – “ఈ రోహిత్‌ను మేమెప్పుడూ చూడలేదు” అంటూ ఆశ్చర్యపోతున్నారు.

రోహిత్ తన తమ్ముడిపై కోప్పడిన దృశ్యం వైరల్
మామూలుగా వివాదాల్ని దూరంగా పెట్టే రోహిత్, ఈసారి మాత్రం తమ్ముడిపై పట్టు విరిచాడు. అసలు విషయం ఏమంటే – ముంబై వాంఖడే స్టేడియంలో ఇటీవల రోహిత్ శర్మ పేరుతో ఓ కొత్త స్టాండ్ ప్రారంభమైంది. ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన గౌరవం. ఈ కార్యక్రమానికి రోహిత్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు.స్కిల్‌కు గౌరవం రావడం అన్నదే ఆటగాడికి గొప్ప గౌరవం. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలు ప్రముఖులు పాల్గొన్నారు. రోహిత్ తల్లిదండ్రులు, భార్య రితిక, తమ్ముడు విశాల్ శర్మ కూడా అక్కడే ఉన్నారు.
కారుకి జరిగిన నష్టం.. విశాల్ చెప్పిన కారణం
ఈ కార్యక్రమం అనంతరం బయటకు వస్తున్న రోహిత్, తన కారును చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే కారుకు ఒకవైపు సొట్టలు పడ్డాయి. వెంటనే ఏమైందని తమ్ముడు విశాల్‌ను ప్రశ్నించాడు.విశాల్ స్పందన ఇలా ఉంది – “రివర్స్ వేస్తుంటే ఇలా జరిగిపోయింది.” ఇక అక్కడే రోహిత్ సీరియస్ అయిపోయాడు. “బుర్ర ఉందా నీకు? జాగ్రత్తగా చూసుకోవాలి కదా!” అంటూ తమ్ముడిపై చిరాకుగా తిట్టాడు .ఇది ఓ చిన్న కుటుంబ సంఘటనే అయినా, రోహిత్ కోపంగా మాట్లాడుతున్న దృశ్యం చూసిన నెటిజన్లు మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో హల్‌చల్
ఈ వీడియో ఇప్పటికే వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లో హల్‌చల్ చేస్తోంది. “ఇంత హుందాగా ఉండే రోహిత్ ఇలా కోప్పడతాడా?” అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.కొందరైతే “ఇది కూడా నార్మల్ హ్యూమన్ ఎమోషన్” అని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం “రోహిత్ ఈ అంత కోపంగా ఉంటాడా అనుకోలేదు” అంటున్నారు. #RohitSharmaViralVideo అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో ఉంది.
అభిమానుల స్పందన
తాజా వైరల్ వీడియో చూసిన అభిమానులు కలగజాలిన అభిప్రాయాలు చెబుతున్నారు. కొంతమంది – “ఇది ఫ్యామిలీ ఇష్యూ.. పబ్లిక్‌గా షేర్ చేయాల్సిన అవసరం లేదు” అంటున్నారు. మరికొందరు మాత్రం – “ఇలాంటివి చూస్తే రోహిత్ మనలాంటి మామూలు మనిషే అనిపిస్తుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా, ఈ వీడియో ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టంగా తేలింది – రోహిత్ శర్మ కూడా కోపపడతాడనే నిజం!మనమందరం చూసే “కూల్ కెప్టెన్ రోహిత్ శర్మ” ఈసారి తమ్ముడిపై కోపంగా ఉండడం నెక్స్ట్ లెవల్ విషయంగా మారింది. ఇది ఆయన సాధారణ జీవితానికి చెందిన విషయం కావొచ్చు. కానీ అది ప్రజల్లో ఆసక్తి రేపుతుంది.అసలు రోహిత్ శర్మ కోపంగా ఉంటే ఎలా ఉంటాడు? అనే ప్రశ్నకు ఈ వీడియో సమాధానమైంది. జీవితంలో ఎవరైనా కోపపడతారు – రోహిత్ కూడా మినహాయింపు కాదు.
Read Also : IPL 2025: ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది:సురేశ్ రైనా