हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Rohit & Virat: రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విరాట్ లకు తగ్గని క్రేజ్

Ramya
Rohit & Virat: రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విరాట్ లకు తగ్గని క్రేజ్

క్రికెట్ అభిమానుల ఆసక్తి అంతా ఇప్పుడు టీమ్ఇండియా-ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్‌పైనే! ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాలోని ఎనిమిది వేర్వేరు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ, టికెట్ల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) రెండు వారాల కిందట టికెట్ సేల్స్‌ను ప్రారంభించగా, ఇప్పటికే దాదాపు 90 వేల టికెట్లు అమ్ముడైనట్లు సీఏ ప్రకటించింది. ముఖ్యంగా సిడ్నీలో జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు టికెట్లు దాదాపు సోల్డ్ ఔట్ (Sold out) అయ్యాయని, అలాగే బ్రిస్బేన్ (Brisbane), మెల్బోర్న్ (Melbourne) టీ20 మ్యాచ్‌లకు కూడా టికెట్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని వెల్లడించింది.

రోహిత్-కోహ్లీ క్రేజ్ ‘తగ్గేదేలే’!

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit & Virat) ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఈ ఇద్దరు లెజెండ్స్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ టికెట్ల అమ్మకాలు మరోసారి నిరూపించాయి. రోహిత్, కోహ్లీలు (Rohit & Virat) టీమ్ఇండియా జెర్సీలో ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుతారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ టూర్‌లో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సిడ్నీలో జరగనున్న మూడో వన్డేనే, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఇద్దరు సీనియర్లకు ఆఖరి వన్డే మ్యాచ్ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. అందుకే రో-కో జోడీకి (Ro-Ko pair) ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు స్పెషల్ ఫేర్‌వెల్ నిర్వహించాలని భావిస్తోందట. ఇదే కారణం సిడ్నీ వన్డేకు అత్యధికంగా టికెట్ సేల్ ఉండటానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా (Australia) లో స్థిరపడిన భారతీయులు ఈ సిరీస్‌పై అధిక ఆసక్తి చూపుతూ, పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారని సీఏ పేర్కొంది. ఈ సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉండటం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా రోహిత్, విరాట్‌లకు (Rohit & Virat) ఉన్న క్రేజ్ ‘తగ్గేదేలే’ అని అభిమానులు ఈ విధంగా నిరూపిస్తున్నారు.

ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్:

వన్డే సిరీస్:

తొలి వన్డే: అక్టోబర్ 19 – పెర్త్ స్టేడియం, పెర్త్

రెండో వన్డే: అక్టోబర్ 23 – అడిలైడ్ ఓవల్, అడిలైడ్

మూడో వన్డే: అక్టోబర్ 25 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ

టీ20 సిరీస్:

తొలి టీ20: అక్టోబర్ 29 – మనుకా ఓవల్, కాన్‌బెర్రా

రెండో టీ20: అక్టోబర్ 31 – మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్

మూడో టీ20: నవంబర్ 2 – బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

నాలుగో టీ20: నవంబర్ 6 – గోల్డ్ కోస్ట్ స్టేడియం, గోల్డ్ కోస్ట్

ఐదో టీ20: నవంబర్ 8 – ది గబ్బా, బ్రిస్బేన్

Read also: ICC: టీ20, టెస్ట్ క్రికెట్‌లో కొత్త నిబంధనలు ప్రకటించిన ఐసీసీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870