వాహనంలో పెట్రోల్ డబ్బా, సుత్తి, కట్టర్ లభ్యం
హైదరాబాద్ (సరూర్ నగర్): హైదరాబాద్ నగర శివార్లలోని ఓ బిజెపి ముఖ్య నేత ఇంటి ముందు రోహింగ్యాల అనుమానాస్పద సంచారం కలకలం రేపింది. పాత సామానులు కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలా ఇంటి ముందు తిరుగుతుండడంతో రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వచ్చి వారిని పోలీసులకు అప్పగించారు. బర్మా నుండి శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలను (Rohingya) తిప్పి పంపాలనీ అదే విధంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మదర్సాలు నిర్వహి స్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల కాలంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బిజెపి నేత ఇంటి వద్ద రోహింగ్యాలు తిరుగుతుండడం అదీ గారి వాహనంలో సుత్తి, పెట్రోలు, ఇనుపరాడ్, కట్టర్ లభించడం అది రెక్కీగా అనుమానాలకు బలం చేకూరి నట్టైంది. ఈ నేపథ్యంలో బిజెపి నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజయలక్ష్మినగర్ కాలనీలో రోహింగ్యాల అనుమానాస్పద సంచారం
తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివార్లలోని నాదరుల్ విజయలక్ష్మినగర్ కాలనీ (Vijayalakshminagar Colony) లో నివసిస్తున్న మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంఛార్జి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడైన అందెల శ్రీరాములు యాదవ్ (Andela Sriramulu Yadav) ఇంటి ముందు శుక్రవారం ఉదయం ట్రాలీ ఏర్పాటు ఉన్న ఎపి 29 జె 7464 నెంబరు గల ద్విచక్ర వాహనాన్ని ఆవుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆగి ఉన్నాడు. దీంతో గమనించిన అందెల ఇంట్లో ఉన్న వారు అనుమానంతో సదరు వ్యక్తిని ప్రశ్నిస్తూ వాహనాన్ని తనిఖీ చేశారు. పాత సామానులు అమ్ముకు నేలాగా వ్యక్తి, వాహనం ఉన్నప్ప టికీ ట్రాలీలోని ఓ బాక్సు లో నిండుగా ఉన్న పెట్రో ల్ లీటర్ డబ్బా, ఒక సుత్తి, కట్టర్ తో పాటు రాడ్ కనిపించాయి. దీంతో సద రు వ్యక్తిని నిల దీయగా వాహనాన్ని వదిలి భయం తో పారిపోయాడు.
ఈ నేపథ్యంలో బిజెపి నేత అందెల శ్రీరాములు యాదవ్ (Andela Sriramulu Yadav) మీర్పేట్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు పంతంగి రాజభూపాల్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొలన్ శంకర్ రెడ్డితో తో పాటు పెద్ద ఎత్తునన తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇన్స్పెక్టర్ కీసర నాగరాజుకు ఫిర్యాదు చేశారు.
Read also: Revanth Reddy: కేంద్రం మెడలు వంచి దేశవ్యాప్తంగా కులగణన సాధించాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి