రోజురోజుకీ టెక్నాలజీ దూసుకుపోతుంది. మనిషి చేసే పనులన్నింటినీ ఇప్పుడు రోబోలు కూడా చేయగలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంట్లో గడగడా తుడుస్తున్నాయి రెస్టారెంట్లలో వడ్డిస్తున్నాయి. ఇప్పుడు బాక్సింగ్ రింగులో బరిలోకి దిగాయి. మీరు చదువుతున్నది నిజం. చైనాలో మొట్టమొదటిసారిగా రోబోల మధ్య బాక్సింగ్ పోటీ జరిగింది. చైనా టెక్ దిగ్గజం “యూనిట్రీ” అనే సంస్థ దీనికి శ్రీకారం చుట్టింది. “జీ1” మరియు “హెచ్1” అనే రెండు హ్యూమనాయిడ్ రోబోలను ప్రత్యేకంగా రూపొందించారు. వీరిద్దరిని ఒక బాక్సింగ్ రింగ్‌లోకి దించారు. సరికొత్త ప్రయోగంగా ప్రారంభమైన ఈ పోటీకి సంబంధించిన ప్రోమో వీడియోను యూనిట్రీ అధికారికంగా విడుదల చేసింది.

రింగ్‌లో దూకిన జీ1, హెచ్1 రోబోలు
జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా, హెచ్1 ఎత్తు 5.11 అడుగులు. వీరిద్దరూ మానవ రూపాన్ని కలిగిన రోబోలుగా తయారు చేశారు. బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి బరిలోకి దిగారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుతూ పోటీ సాగించారు. వీళ్ల బాక్సింగ్ చూస్తే నిజంగా మనిషిలా అనిపిస్తుంది. అయితే, ఈ రోబోలు విసిరిన పంచ్‌లు, కిక్‌లకు బలం లేదన్నదే అసలు సంగతిగా మారింది. దెబ్బలు తగలకపోయినా… రోబోల తీరే చూడముచ్చటగా ఉంది. అవి నిరంతరం స్పారింగ్ చేయడమే అభిమానులను ఆకట్టుకుంది. మానవులు చేసే లైట్ ట్రైనింగ్ మాదిరిగానే ఈ బౌట్ సాగింది.
ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం
ఇలాంటి రోబో బాక్సింగ్ పోటీ జరగడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఏ దేశంలోనూ రోబోలు ఇలా బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యక్షంగా పోటీ పడలేదు. యూనిట్రీ చేసిన ఈ ప్రయత్నం టెక్ ప్రపంచంలో ఆసక్తికర మలుపు తెచ్చింది. భవిష్యత్తులో రోబో స్పోర్ట్స్ కి ఇది నాంది కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వీడియో చూసిన నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మనిషి తక్కువైనా, మెషిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోబోలు చేసే స్టెప్పులు, చాకచక్యంగా ఎగిరే చేతులు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ ప్రయోగం తక్కువ ప్రాముఖ్యతగలదని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది కేవలం వినోదానికి కాదు. భవిష్యత్తులో రోబోలు ఫిజికల్ స్పోర్ట్స్‌లో ఎలా పాల్గొనగలవో చూపించిన మొదటి అడుగు. ఇకపై శారీరక శ్రమ అవసరమైే రంగాల్లో కూడా రోబోలు అడుగు పెట్టే రోజులు దూరం కాదు.
Read Also : Walking: నడక అన్ని విధాలా మేలు