ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రెస్ అవుతోంది బీసీసీఐ. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అభిమానులకు మరింత ఆకర్షణీయమైన అనుభూతిని అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి ప్రత్యక్ష ప్రసారంలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కృత్రిమ మేధస్సుతో పనిచేసే ‘రోబో డాగ్’ను ఐపీఎల్‌లో ప్రవేశపెట్టింది.

రోబోడాగ్
ఈ రోబోటిక్ డాగ్‌ను మ్యాచ్ బ్రాడ్‌కాస్ట్ సమయంలో ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరో కాదు, ప్రఖ్యాత కామెంటేటర్ డానీ మారిసన్. ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు వార్మప్ చేస్తున్న సమయంలో ఈ ప్రత్యేక రోబో డాగ్ ఆ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చి ఆటగాళ్లతో చక్కగా వ్యవహరించిన ఈ యంత్ర శునకం, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఆ సమయంలో ఫ్యాన్స్‌లో జోష్ పెంచేసింది. డానీ మారిసన్ ఇచ్చిన వాయిస్ కమాండ్‌లను రోబోడాగ్ సరిగ్గా అర్థం చేసుకుని, ఆయనే చెప్పినట్లుగా అడుగులు వేసి ముందుకు వచ్చి ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, బోర్డు టెక్నాలజీతో ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతున్నట్టు అర్థమవుతోంది. కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్‌లకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను అలరించింది.
Read also: IPL 2025 : IPL లో చరిత్ర సృష్టించిన MI