RK Roja meet with YS Jagan

వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ

గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న హైకమాండ్

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా, గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండవ కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేసిన పార్టీ అధిష్టానం.

వైఎస్ జగన్తో ఆర్కే రోజా

అతడి చేరికకు బ్రేక్

అయితే, గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో అతడి చేరికకు బ్రేక్ పడింది. ఇక, ఈరోజు అదే అంశంపై రోజాతో మాజీ సీఎం వైఎస్ జగన్ చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో గాలి జగదీష్ ప్రకాష్ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

రోజా తీవ్ర అభ్యంతరం

కాగా, దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి రెండో కుమారుడు, నగరి నేత గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధిష్ఠానం సిద్ధమయిందనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. తొలుత వచ్చిన వార్తల ప్రకారం ఇప్పటికే వైసీపీలో జగదీశ్ చేరాల్సి ఉంది. అయితే, రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన చేరికకు బ్రేక్ పడిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై రోజాతో జగన్ చర్చించినట్టు సమాచారం.

Related Posts
ఫిబ్రవరి 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు: సత్యప్రసాద్
satya prasad

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు మార్పులను చేస్తున్నది. ఇందులో భాగంగా రిజిస్ర్టేషన్ విధానంలోను మార్పులను తీసుకుని వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త Read more

రాజకీయాల్లో విజయం: మోదీ సూచనలు
రాజకీయాల్లో విజయం: మోదీ సూచనలు

ప్రధాని నరేంద్ర మోడీ, జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తోతో పాడ్కాస్ట్‌లో ఒక రాజకీయ నాయకుడు విజయవంతం కావడానికి అవసరమైన లక్షణాలను వివరించారు. ఆయన కమ్యూనికేషన్, అంకితభావం మరియు Read more

ఆదోనికి పోసాని కృష్ణమురళి
Krishna Murali, who gave it to Adoni

అమరావతి: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో Read more

టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని
Alla Nani

వైసీపీకి దెబ్బమీదదెబ్బ తగులుతున్నాయి. ఈ పార్టీకి రాజీనామాల వరుసలు మొదలయ్యాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 Read more