టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తో విడాకుల అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్ తో ప్రేమలో ఉన్నట్లు గాసిప్,ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.తాజాగా మహ్‌వశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో “హస్బెండ్” అనే వీడియో పోస్ట్ చేయగా, ఆ వీడియోకు చాహల్ లైక్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో నెటిజన్లలో చాహల్, మహ్‌వశ్ మధ్య ఏదో నడుస్తోందని చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో చాహల్‌తో డేటింగ్ రూమర్స్‌పై మహ్‌వశ్ స్పందించారు.
అవసరం లేని వ్యక్తులు వద్దు
గతంలో ఓ వ్యక్తితో తనకు నిశ్చితార్థం జరిగిందని ఆ బంధం తెగిపోయిందని చెప్పుకొచ్చారు. ‘నేను ప్రస్తుతం ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను.నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే డేటింగ్‌కి వెళ్తా. అదికూడా క్యాజువల్ డేటింగ్‌కు కాదు. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తితో మాత్రమే డేటింగ్ చేస్తా’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహ్‌వశ్ కామెంట్ వైరల్ అవుతోంది.కాగా, రెండు రోజుల క్రితం మహ్‌వశ్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హస్బెండ్’ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో మహ్‌వశ్ హిందీలో మాట్లాడుతూ ‘నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో అతనే నా జీవితంలో ఏకైక వ్యక్తి అవుతాడు. అతనే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో కూడా మాట్లాడలేను’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ఆకర్షిస్తోంది. మహ్‌వశ్ షేర్ చేసిన ఈ రీల్ వీడియోని చాహల్ లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది.
మళ్లీ ప్రేమ
ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్‌వశ్ తో చాహల్ డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్‌వశ్‌తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో చాహల్‌తో డేటింగ్ రూమర్స్‌పై మహ్‌వశ్ స్పందించారు. తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని సింగిల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు.దీంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.’చాహల్ ఇచ్చిన లైక్ శాశ్వతం’ అంటూ స్పందించారు.అలాగే ఈమె ఒక యూట్యూబర్ కూడా ఇక ఇంతకు మించి హైలైట్ ఏమిటంటే ఈమెకి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ లో ఏకంగా 1.5 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.