పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

Temperatures : పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisements
పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు

ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల ప్రాంతంలో సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. ఈసారి మాత్రం మార్చి మధ్యలోనే 42 డిగ్రీలు దాటిపోయింది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది.

డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం

మార్చిలోనే భానుడు తన ప్రతాపంతో టాప్ లేపేస్తున్నాడు.. ఈ ప్రాంతం అ ప్రాంతం అని తేడాలేకుండా మంటలు పుట్టిస్తున్నాడు. దీంతో జనాలు అసమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నార వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Related Posts
IRCTC సేవల్లో అంతరాయం..
IRCT Major Outage Hits Indian Railways

భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ రోజు గణనీయమైన అవుటేజ్‌లను ఎదుర్కొంది. దీని ఫలితంగా, ప్రయాణికులు రైలు టికెట్లను బుక్ చేయడానికి వెబ్‌సైట్ Read more

రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Ratha Saptami.. Devotees fl

రథ సప్తమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈ పర్వదినాన్ని సూర్య భగవానుని జన్మదినంగా పూజిస్తూ, విశేష ఆరాధనలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ Read more

రాజకీయాల్లో విజయం: మోదీ సూచనలు
రాజకీయాల్లో విజయం: మోదీ సూచనలు

ప్రధాని నరేంద్ర మోడీ, జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తోతో పాడ్కాస్ట్‌లో ఒక రాజకీయ నాయకుడు విజయవంతం కావడానికి అవసరమైన లక్షణాలను వివరించారు. ఆయన కమ్యూనికేషన్, అంకితభావం మరియు Read more

2028 లో ప్రారంభం కానున్న శుక్రయాన్ మిషన్..
isro shukrayaan

భారతదేశం 2028 లో ప్రారంభం కానున్న "శుక్రయాన్" అనే వెనస్ ఆర్బిటర్ మిషన్‌తో ఒక ముఖ్యమైన స్పేస్ మైల్‌స్టోన్‌ను సాధించడానికి సిద్ధమవుతోంది.ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) Read more

×