ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.అయితే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ప్రదర్శనను మరిచిపోలేనిదిగా మార్చుకున్నాడు.6 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కొన్ని తప్పులు చేశాడు.చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ చేశాడు.
స్టేడియంలో సరదాగా
మ్యాచ్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్టేడియంలో సరదాగా హాస్యప్రధంగా కనిపించారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.18వ ఓవర్‌లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో,రెండో బంతిని ఢిల్లీ ఆటగాడు కుల్దీప్ యాదవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ వికెట్ కీపర్ పంత్ చేతుల్లో పడింది.రిషబ్ పంత్ స్టంప్స్‌పై బంతిని కొట్టేందుకు ప్రయత్నించాడు, కానీ కుల్దీప్ క్రీజులోనే ఉన్నాడు.
సరదాగా పంత్, కుల్దీప్‌ను క్రీజు వెలుపలికి నెట్టి, వికెట్లపై బెయిల్స్ వేయడం జరిగింది.
ఇది మ్యాచ్ సమయంలో నవ్వు తెప్పించే ఘటనగా మారింది.
హై-వోల్టేజ్ పోరు
మ్యాచ్ పూర్తిగా లక్నో చేతి లోనే ఉన్నా, చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఓటమిని తప్పించుకోలేకపోయింది.టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.లక్నో బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (75), మిచెల్ మార్ష్ (72) చెలరేగి ఆడారు.లక్నో సూపర్ జెయింట్స్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత తడబడినా, చివరి క్షణాల్లో మ్యాచ్ ఉత్కంఠ రేగింది.అశుతోష్ శర్మ (66) చివరి ఓవర్‌లో సిక్సర్ బాదడంతో, ఢిల్లీ మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.
రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఒత్తిడి
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కీలకమైన తప్పిదాలు చేశాడు.ఫీల్డింగ్‌లో కూడా కొన్ని అవకాశాలను కోల్పోయాడు.ఈ ఓటమితో రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్‌లలో పంత్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటాడా,లేదా అతని కెప్టెన్సీపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయా, అన్నది ఆసక్తికరంగా మారింది.