RG Kar issue. Junior doctors hunger strike enters 10th day

10వ రోజు జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష

కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం చర్చలు జరిగాయి. బెంగాల్ ప్రభుత్వానికి, డాక్టర్లకు జరిగిన చర్చలు విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది.

Advertisements

మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల దగ్గర 12 గంటల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. డాక్టర్ల డిమాండ్‌ మేరకు కోల్‌కతా సీపీ, మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ మిగతా డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా లేదని డాక్టర్లు తెలిపారు. ‘నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం.సమస్య పరిష్కారంపై టైం గడువు చెప్పలేమని సీఎస్ మనోజ్‌ పంత్‌ సూచనప్రాయంగా తెలిపారు’ అని భేటీలో పాల్గొన్న వైద్యులు తెలిపారు.

Related Posts
అర్చకులు రంగరాజన్‌ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్
cm phone rangarajan

చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన స్వయంగా రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. Read more

చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
cbn amithsha

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా Read more

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు
pranab mukherjee daughter

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ Read more

చైతు – శోభిత ల స్నేహం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలుసా..?
nagachaitnya shobitha

నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహం రీసెంట్ గా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో Read more

Advertisements
×