Bhadrakali Movie : వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ, తన తాజా చిత్రం ‘భద్రకాళి’తో థియేటర్లలోకి రాబోతున్నారు. (Bhadrakali Movie) ఈ సినిమా సెప్టెంబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
రిసెంట్‌గా విడుదల చేసిన 4 నిమిషాల స్నీక్ పీక్ వీడియోతోనే సినిమా హైప్ పెరిగిపోయింది. ఇందులో 1989 నేపథ్యంతో ఒక గిరిజన మహిళ హత్య, ఆ కేసు దర్యాప్తులో పోలీసులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, చెత్త కుప్పలో పడేసిన పసిబిడ్డ వంటి షాకింగ్ సన్నివేశాలు చూపించారు. ఈ పసిబిడ్డే తర్వాత హీరో అవుతాడా? నిజానికి న్యాయం దక్కుతుందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు సృష్టించాయి.
దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా సామాజిక, రాజకీయ, కార్పొరేట్ అవినీతిపై కఠినమైన ప్రశ్నలు లేవనెత్తేలా ఉంది. కథలో రియలిస్టిక్ టచ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
విజయ్ ఆంటోనీ ఎప్పుడూ నటుడిగానే కాదు, సంగీత దర్శకుడు, గాయకుడు, ఎడిటర్, నిర్మాతగానూ కొత్తదనం చూపిస్తూ అభిమానులను అలరిస్తారు. ఆయన కెరీర్‌లో బిచ్చగాడు, నకిలీ, మార్గన్ వంటి చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు స్వయంగా నిర్మించిన భద్రకాళితో మళ్లీ బిగ్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
సోషల్ మీడియాలో విడుదలైన స్నీక్ పీక్‌పై ఫ్యాన్స్ రియాక్షన్స్ చూస్తే –
“ఇదీ మరో బ్లాక్ బస్టర్!”
“విజయ్ ఆంటోనీ మరోసారి హిట్ ఖాయం”
అని కామెంట్లు చేస్తున్నారు.
Read aslo :