The Bengal Files Movie Review : దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది బెంగాల్ ఫైల్స్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ 4తో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టినా, (The Bengal Files Movie Review) ఈ సినిమా 1946లో జరిగిన గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ నిజాలను చూపించినందుకు ప్రశంసలు అందుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లో రిలీజ్ కాకపోయినా, దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.
నెటిజన్లు ఈ సినిమాను కేవలం సినిమా కాదు, బెంగాల్ రక్త చరిత్రను బయట పెట్టిన అద్దం అని అంటున్నారు.
సినిమాలో అనుపమ్ ఖేర్, సస్వతా చటర్జీ, దర్శన్ ఖాన్, సిమ్రత్ కౌర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఒక నెటిజన్ X (ట్విట్టర్)లో ఇలా రాశాడు:
“ది బెంగాల్ ఫైల్స్ హృదయాన్ని కదిలించే సినిమా. సిమ్రత్ కౌర్ భారతి బెనర్జీ పాత్రలో ప్రాణం పోశారు. ఆమె ఎమోషన్లు మనసుని కదిలిస్తాయి. పల్లవి జోషి, నమాషి కూడా అద్భుతం. మిథున్ దా ఎప్పటిలాగే బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు.”
మరొకరు రాశారు
“ఇప్పటికీ సిమ్రత్ కౌర్ మోనాలాగ్ మర్చిపోలేకపోతున్నాను. అద్భుతమైన నటన, అవార్డు అందుకోవాల్సిన స్థాయి. నిజంగానే గుండెను కదిలించే అనుభవం.”
ఇంకో నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు:
“గుండెను కుదిపేసే అనుభవం! వివేక్ అగ్నిహోత్రి అద్భుతమైన కథనం, మనసుని తాకే విజువల్స్. సిమ్రత్ కౌర్, పల్లవి జోషి, నమాషి చక్రవర్తి, దర్శన్ కుమార్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సస్వతా & సౌరవ్ దాస్ బలమైన సపోర్ట్ ఇచ్చారు. ఇది సినిమా మాత్రమే కాదు… చరిత్ర స్క్రీన్‌పై కనిపించిందని చెప్పాలి. చూడాల్సిందే!
Read also :