కాంతార సినిమాతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ పాన్ ఇండియానే తనవైపు చూసేలా చేశారు రిషబ్ శెట్టి (Rishab Shetty) . ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన కాంతార అటు కలెక్షన్లలోనూ, ఇటు క్రిటిక్స్ ప్రశంసల్లోనూ రికార్డులు సృష్టించింది. ఆ సినిమా రిషబ్ శెట్టి కెరీర్‌ను మలుపుతిప్పింది. అటు నేషనల్ లెవెల్‌లోనూ,
nayanika: అల్లు శిరీశ్ నయనికతో నిశ్చితార్ధానికి మూహూర్తం ఖరారు
ఇటు అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులు దక్కాయి. అలాంటి విజయం తరువాత రిషబ్ తనపై మరింత నమ్మకాన్ని పెంచుకుని కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1)అనే ప్రీక్వెల్‌ను రూపొందించాడు. ఈసారి మాత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ స్టాండర్డ్స్,తో సినిమాని తెరకెక్కించాడు. మరి ఈ సినిమా నిజంగా కాంతార రేంజ్‌లో ఉందా? చూద్దాం.
కథ
మా నాన్న ఇక్కడే మాయమయ్యాడు.. అసలు ఇక్కడేముంది అంటూ హీరో అడిగే ప్రశ్నతో కాంతార సినిమా ఎండ్ అవుతుంది. ఇక కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) అదే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ కుర్రాడికి ఓ పెద్దాయన చెప్పిన కాంతార కథే ఈ సినిమా. “ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. అప్పుడు ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు.
ఈ గణాలన్నీ వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే” అంటూ దట్టమైన అడవిలో ఉన్న కాంతార రహస్యాలు చెబుతూ సినిమా మొదలవుతుంది.సాక్షాత్ పరమేశ్వరుడు కాంతారలో వెలిశాడని.. తన భర్త ధ్యానం చేసుకునేందుకు అక్కడే పార్వతి దేవి ‘శివుని పూతోట’ అంటూ ఓ ప్రాంతాన్ని సృష్టించిందంటూ అక్కడి ప్రజలు నమ్ముతారు.
కథనం
అయితే అక్కడ కాంతారవాసులకి ఒకరోజు నీటిలో ఒక రాయి (శివలింగం ఆకారంలో) దొరుకుతుంది. దీంతో దాన్నే దేవుడిగా భావించి ఆరాధించుకుంటారు. అయితే అప్పటికే చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ గెలుచుకొని బాంగ్రా మహారాజు మహాగర్వంతో విర్రవీగుతూ ఉంటాడు.ఒక రోజు అనుకోకుండా అడవిలో ఉన్న కాంతారకి వచ్చిన బాంగ్రా మహారాజుని ఓ అదృశ్య శక్తి చంపేస్తుంది.

ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొని తన రాజ్యానికి చేరుకుంటాడు మహారాజు కొడుకు (జయరామ్). కానీ తన కళ్ల ముందే తన నాన్నని చంపేసిన ఆ శక్తిని తలచుకొని ప్రతిరోజూ భయపడుతూనే ఉంటాడు. తనకి పుట్టిన ఇద్దరి పిల్లలకి రోజూ కాంతార గురించి కథలు కథలుగా చెబుతుంటాడు. ఏమైనా సరే కాంతారకి మాత్రం వెళ్లొద్దు.. అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని చెబుతుంటాడు.
విశ్లేషణ
కొన్నాళ్లకి తన కొడుకు కులశేఖర (గుల్షన్ దేవయ్య)కి మహారాజ పట్టాభిషేకం (Coronation of the Maharaja) చేసి మురిసిపోతాడు రాజు. కానీ కులశేఖరకి లేని అలవాటు ఉండదు. చిన్నప్పటి నుంచి కాంతార గురించి తన నాన్న చెప్పినవన్నీ కట్టుకథలే అంటూ తన స్నేహితుల్ని, భటుల్ని తీసుకొని కాంతారకి వేటకి వెళ్తాడు. హద్దులు దాటి తమ ప్రదేశానికి వచ్చిన వీళ్లని కాంతార వాసులు తరిమికొడతారు.
కొన్నేళ్ల క్రితం కాంతార వాసులకి అక్కడే ఉన్న ఒక లోయలో పులి పక్కనే ఓ పసిబిడ్డ దొరుకుతాడు. వాడికి బర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచుతారు. కాంతారకి తనే నాయుకుడు అవుతాడు.ఇక తమ ప్రదేశానికి వచ్చిన బాంగ్రా రాజుకి సరైన గుణపాఠం చెప్పాలని బర్మే తన స్నేహితులతో కలిసి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు.
అక్కడ ఓ ప్రమాదం నుంచి యువరాణి కనకావతి (రుక్మిణి వసంత్)ని కాపాడతాడు. తర్వాత ఆమె బర్మేపై మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు కులశేఖర మొత్తం కాంతారనే తగలబెట్టేస్తాడు. మరి అప్పుడు ఏం జరిగింది? కాంతారని ఎవరు కాపాడారు? అసలు బర్మే ఎవరు? బాంగ్రా రాజ్యంతో కాంతార ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? అసలు కనకావతి ఎవరు అనేదే మిగిలిన కథ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: